యాప్నగరం

ఓ దేశం ఉగ్రవాదం వ్యాపించేలా చేస్తోంది

భారత ప్రధాని మోడీ మరోసారి పరోక్షంగా పాక్ కు చురకలంటించారు.

TNN 8 Sep 2016, 12:15 pm
భారత ప్రధాని మోడీ మరోసారి పరోక్షంగా పాక్ కు చురకలంటించారు. ఉగ్రవాదాన్ని, హింసాయుత వాతావరణాన్ని ఇతర దేశాలకు పాక్ ఎగుమతి చేస్తోందంటూ విమర్శించారు. ఎక్కడా పాకిస్తాన్ పేరు ఎత్తకపోయినా మోడీ మాట్లాడేది ఆ దేశం గురించే అని స్పష్టంగా అర్థమయ్యేలా ప్రసంగం ఉంది. లావోస్ రాజధాని వియాంటియన్ లో 14వ ఆసియన్-ఇండియా సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులోనే గురువారం మోడీ ప్రసంగించారు. ప్రసంగం మోడీ మాటల్లోనే... ‘ఇప్పుడు అన్ని దేశాల సమస్య ఉగ్రవాదమే. దక్షిణాసియాలోని ఓ దేశం (పాక్ నుద్దేశించి) ఉగ్రవాదాన్ని, రాడికల్ భావజాలాన్ని, హింసాయుత వాతావరణాన్ని ఇతర దేశాలకు వ్యాపింప చేస్తోంది. దీనిపై ఆసియా దేశాలన్ని కలిసికట్టుగా పోరాటం చేయాలి. మేం సిద్ధంగా ఉన్నాం... ఉగ్రవాదంపై పోరాడుతాం, సైబర్ సెక్యూరిటీపై పోరాడతాం. ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకుంటాం. మా పోరాటానికి ఆసియన్ దేశాలు కూడా మద్దతిస్తారని కోరుకుంటున్నాం’ అని అన్నారు. ఇటీవల చైనాలో జరిగిన జీ20 సదస్సులో కూడా మోడీ పాక్ పై తీవ్ర విమర్శుల చేశారు.
Samayam Telugu speech by pm modi on pak in laos
ఓ దేశం ఉగ్రవాదం వ్యాపించేలా చేస్తోంది


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.