యాప్నగరం

డామ్రే తుఫాను దాటికి 49 మంది మృతి

వియత్నాం, మలేషియాలో ‘డామ్రే’ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గత 16 ఏళ్లలో సంభవించిన అత్యంత బలమైన తుఫాన్ బారినపడి ఇప్పటికే 49 మంది మరణించారు. కుండపోత వానలు, పెను గాలులతో విరుచుకుపడుతున్న డామ్రే ధాటికి వందలాది మంది గల్లంతయ్యారు.

TNN 6 Nov 2017, 12:25 pm
వియత్నాం, మలేషియాలో ‘డామ్రే’ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గత 16 ఏళ్లలో సంభవించిన అత్యంత బలమైన తుఫాన్ బారినపడి ఇప్పటికే 49 మంది మరణించారు. కుండపోత వానలు, పెను గాలులతో విరుచుకుపడుతున్న డామ్రే ధాటికి వందలాది మంది గల్లంతయ్యారు. గంటకు 130 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. వియత్నాంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. 50 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముంచెత్తుతున్న వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Samayam Telugu strongest typhoon in 16 years damrey kills 49 in vietnam
డామ్రే తుఫాను దాటికి 49 మంది మృతి


ఆసియా, పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ భారీ ప్రకృతి విపత్తు సంభవించడంతో వియత్నాం ప్రభుత్వం అప్రమత్తమైంది. వివిధ దేశాధినేతలు అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది.

డామ్రే బీభత్సానికి మలేషియాలోనూ 10 మంది వరకు మృతి చెందారు. 15 గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి కొన్నిప్రాంతాల్లో 14 అడుగుల వరకు నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల్లోని 5 వేల మందికిపైగా ప్రజలను మలేషియా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.