యాప్నగరం

Pakistan Violence: ఇమ్రాన్‌ఖాన్‌కు షాకిచ్చిన పాక్ సుప్రీంకోర్టు.. అయ్యో పాపం!

Pakistan Violence: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత.. ఘర్షణలు, హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. దీంతో శాంతి భద్రతలను కాపాడటానికి పాకిస్తాన్ ప్రభుత్వం భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇప్పటివరకు 1,000 మందికి పైగా అరెస్టులు జరిగాయి. నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లే రహదారులను సీల్ చేశారు. ఇదే సమయంలో.. ఇమ్రాన్‌కు పాక్ అపెక్స్ కోర్టు షాకిచ్చింది. ఇటు కోర్టులో ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 10 May 2023, 5:45 pm

ప్రధానాంశాలు:

  • ఇమ్రాన్‌ ఖాన్‌కు షాకిచ్చిన పాక్ సుప్రీంకోర్టు
  • బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
  • కస్టడీలో తనకు ఇంజక్షన్లు ఇచ్చారన్న ఖాన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Shock for Imran Khan
ఇమ్రాన్ ఖాన్‌కు షాక్
Pakistan Violence: ఇమ్రాన్‌ ఖాన్‌కు పాకిస్తాన్ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులోనే అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. బుధవారం ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) కు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం కోర్టు తన నిర్ణయాన్ని తొలుత రిజర్వ్‌లో పెట్టింది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
విచారణ సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ సంచలన ఆరోపణలు చేశారు. కస్టడీలో తనకు ఇంజక్షన్లు ఇచ్చారని చెప్పారు. 'నేను 24 గంటల్లో వాష్‌రూమ్‌కి కూడా వెళ్లలేదు. దయచేసి నా డాక్టర్ ఫైసల్‌ని పిలవడానికి అనుమతించండి. మక్సూద్ చప్రాసీకి జరిగినది నాకు జరగకూడదని అనుకుంటున్నాను. గతంలో వారు ఇంజెక్ట్ చేశారు. అతను నెమ్మదిగా మరణించాడు. కస్టడీలో నాకు అలాంటి ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇది నా మరణానికి దారి తీస్తుంది' అని ఇమ్రాన్ కోర్టుకు వివరించారు.
ఇదే సమయంలో.. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నట్టు మెడికల్ బోర్డు ప్రకటించింది. అతని షుగర్ లెవెల్, పల్స్, బీపీ అన్నీ నార్మల్‌గా ఉన్నాయని తెలిపింది. లిపిడ్ ప్రొఫైల్ కోసం రక్త నమూనాలు సేకరించామని చెప్పింది. మరోవైపు పాకిస్థాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. 1000 మందికి పైగా పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్సులలో అన్ని పరిపాలనా, శాంతి భద్రతల విధులు ఇప్పుడు సైన్యం చేతుల్లోకి వెళ్లాయి.
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో సైనికుల పాలన సాగుతోంది. పాకిస్థాన్ అణు స్థావరం, అణు విద్యుత్ కేంద్రం వద్ద భద్రతను భారీగా పెంచారు. సాయుధ కమాండోలను మోహరించారు. రోడ్లను పూర్తిగా మూసివేశారు. డ్రోన్ల ద్వారా ఆ ప్రాంతమంతా పర్యవేక్షిస్తున్నారు. అయినా ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళనలు ఆపడం లేదు. లాహోర్, రావల్పిండి వంటి నగరాల్లో పరిస్థితి గంట గంటకూ ఉద్రిక్తంగా మారుతోంది. భవనాలు, వాహనాలను ధ్వంసం చేస్తున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.