యాప్నగరం

టాంజానియాలో ఘోర బోటు ప్రమాదం.. 80మందికిపైగా మృతి

బోల్తాపడిన బోటు.. 80మందికిపైగా మృతి. వందలమంది గల్లంతు..

Samayam Telugu 21 Sep 2018, 10:32 pm
టాంజానియాలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. విక్టోరియా లేక్‌లో ప్రయాణికులతో వెళుతుండగా బోటు బోల్తా కొట్టగా.. ప్రమాదంలో 80మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులు 400మంది ఉంటారని అంచనా వేస్తుండగా.. 37మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన వారంతా గల్లంతుకాగా.. వారి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నారు. బోటు మరికొద్దిసేపట్లో ఒడ్డుకు చేరుకుంటుందనగా ప్రమాదం జరిగింది.
Samayam Telugu Ferri


ఆఫ్రికాలోని టాంజానియా, ఉగాండా, కెన్యాలనుకలుపుతూ విక్టోరియా లేక్ ఉంది. బుగొలోరా అనే ప్రాంతంలో మార్కెట్ కావడంతో.. జనాలు భారీగా తరలివచ్చారు. అందరూ సరుకులు కొనుగోలు చేసి.. బోటు ఎక్కారు. కొందరు సిమెంట్ బస్తాలు, పశువులకు దాణా, గ్రాసాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ బోటు పాతది కావడం.. 200 మంది ప్రయాణికులు మాత్రమే ఎక్కే అవకాశం ఉన్నా.. 400మందిని ఎక్కించినట్లు తెలుస్తోంది. బోటుకు బరువు పెరగడంతో బోటు బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

గల్లంతైనవారిలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదానికి కారణాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంతో భారీ ప్రాణనష్టం ఏర్పడగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.