యాప్నగరం

చైనాలోని హోటల్‌లో అగ్ని ప్రమాదం...10 మంది మృతి

ఆగ్నేయ చైనాలోని జియాంగ్స్ ప్రావిన్సుల రాజధాని నగరంలో ఓ హోటల్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

TNN 25 Feb 2017, 3:09 pm
ఆగ్నేయ చైనాలోని బ్లేజ్ హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో పది మంది మృతి చెందారు. శనివారం ఉదయం ఈ ప్రమాదం సంభవించినట్లు జిన్హూ న్యూస్ ఏజెన్సీ తన అధికారిక మైక్రోబ్లాగ్‌లో పేర్కొంది. ఆగ్నేయ చైనాలోని జియాంగ్స్ ప్రావిన్సుల రాజధాని నగరం నచాంగ్ పట్టణంలోని శనివారం మంటలు చెలరేగినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు, పోటోలు చైనా సోషల్ మీడియాలో అప్ చేసింది.
Samayam Telugu ten killed in hotel blaze in southeastern china
చైనాలోని హోటల్‌లో అగ్ని ప్రమాదం...10 మంది మృతి


హోటల్ భవనంలో కస్టమర్లతోపాటు ఆధునికీకరణ పనులు చేస్తున్న పనివాళ్లు కూడా ఉన్నట్లు తెలియజేసింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేయడానికి డజన్ల కొద్దీ ఫైర్ ఇంజిన్లు, సిబ్బంది శ్రమిస్తున్నట్లు వీడియోల్లో రికార్డైంది. ఈ ఘటనలో ప్రాణాలు దక్కించుకోడానికి రెండో అంతస్థు కిటికిలో నుంచి దూకి ఓ వ్యక్తి గాయపడటంతో అతడిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారని వివరించింది.

బిల్డింగ్ ఆధునికీకరణ కోసం ఉపయోగించిన మెటీరియల్ వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ప్రమాదాలు చైనాలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. భద్రత నిబంధనల విషయంలో మాత్రం రాజీ ఉండదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.