యాప్నగరం

జర్మనీ షాపింగ్ మా‌ల్‌లో ఉగ్ర బీభత్సం

ఓ ఉగ్రవాది జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో బీభత్సం సృష్టించాడు.

TNN 23 Jul 2016, 9:12 am
ఓ ఉగ్రవాది జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో బీభత్సం సృష్టించాడు. అక్కడి కాలమానం ప్రకారం... ఉదయం 11.50 గంటలకు ఒలంపియా షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశించాడు. నేరుగా... అందులో ఉన్న మెక్ డోనాల్డ్స్ రెస్టారెంట్‌లోనికి వెళ్లాడు. అక్కడ నిల్చుని తెచ్చుకున్న తుపాకితో విచక్షణా రహితలంగా పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదికి 18 ఏళ్లు ఉంటాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొందరు సోఫాలు, టేబుళ్ల చాటున దాక్కున్నారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వచ్చేసరికే షాపింగ్ మాల్ నుంచి ఉగ్రవాది మెట్రో స్టేషన్ వైపు పరుగులు తీశాడు. దీంతో ఆ వైపుగా ప్రజల్ని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతమంతా భద్రతా సిబ్బంది జల్లెడ పట్టడం ప్రారంభించారు. పోలీసులను చూసిన ఉగ్రవాది తనను పేల్చేసుకున్నాడు. ఆ ఉగ్రవాది ఇరాన్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా జర్మనీ కూడా ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్నట్టు ఈ ఘటనతో రుజువైంది. ఇంతకాలం పక్కనే ఉన్న ఫ్రాన్స్ పైనే ఉగ్రదాడులు జరిగేవి. మొదటిసారి జర్మనీని కూడా టార్గెట్ చేశారు ముష్కరులు.
Samayam Telugu terror attack in shoppingmall in germany
జర్మనీ షాపింగ్ మా‌ల్‌లో ఉగ్ర బీభత్సం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.