యాప్నగరం

థాయ్ రెస్క్యూ షాకింగ్ సీక్రెట్: మత్తిచ్చి, నిద్రపుచ్చి..

థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న 13 మందిని సురక్షితంగా రెస్క్యూ టీమ్‌లు బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారిని ఏ విధంగా తీసుకొచ్చారో ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచారు.

Samayam Telugu 11 Jul 2018, 11:53 pm
థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న 13 మందిని సురక్షితంగా రెస్క్యూ టీమ్‌లు బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారిని ఏ విధంగా తీసుకొచ్చారో ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఇందుకు కారణం.. వారు ఎంచుకున్న విధానం అత్యంత ప్రమాదకరమైనది కావడమేనని తెలుస్తోంది.
Samayam Telugu 20aaaaa


ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న థాయ్‌లాండ్ నేవీ సీల్ అధికారి ఒకరు ‘ఏఎఫ్‌పీ’ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఆ చిన్నారులను స్ట్రెచర్ మీద తీసుకొచ్చామని తెలిపారు. ఆ సమయంలో వారంతా నిద్రావస్థలో ఉన్నారని తెలిపారు. ఇది అత్యంత క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ కావడంతో ఈ రహస్యాన్ని మీడియాకు కూడా తెలియకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. చిన్నారులను బయటకు తీసుకొచ్చేప్పుడు కూడా మీడియా కంట పడకుండా తెల్లని గొడుగులు అడ్డుగా పెట్టి.. హెలికాప్టర్లో తరలించారు. 13 మంది హాస్పిటల్‌లో కోలుకున్నారని తెలిసిన తర్వాతే ఈ రహస్యాన్ని బయటకు చెప్పారు.

గుహలో చిక్కుకున్న చిన్నారులకు ఈత రాదు, పైగా వారు చాలా బలహీనంగా ఉన్నారు. ప్రమాదకర మార్గం నుంచి తీసుకొచ్చేప్పుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వారికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి నిద్రలోకి జారుకునేలా చేశారు. పూర్తిగా స్పృహ కోల్పోకుండా.. జాగ్రత్తపడ్డారు. వారికి ఆక్సిజన్ మాస్కులు పెట్టి బయటకు తీసుకొచ్చారు.

‘‘గుహ నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో మత్తు ప్రభావానికి కొంతమంది నిద్రపోయారు. మరికొందరు చేతులు అటూ ఇటూ కదిపేవారు’’ అని కమాండ్ చైయనంతా పీరానారోంగ్ తెలిపారు.
చిన్నారులను బయటకు ఎలా తీసుకొచ్చారో ఈ వీడియోలో చూడండి.

చిన్నారులంతా క్షేమం ఇదిగో వీడియో: గుహలో నుంచి బయటపడిన చిన్నారులంతా క్షేమంగా ఉన్నారంటూ థాయ్ ప్రభుత్వం ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో చిన్నారులంతా హాస్పిటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపించారు. ఆ వీడియోను ఇక్కడ చూడగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.