యాప్నగరం

30 బిలియన్ పౌండ్లతో బ్రిటన్ విడాకుల ఒప్పందం?

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగనున్న బ్రిటన్.. అందుకోసం 30 బిలియన్ యూరోలు చిల్లించడానికి సిద్ధపడింది.

TNN 18 Sep 2017, 5:05 pm
బ్రెగ్జిట్ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌తో ప్రతిష్టంభనను తొలగించుకోవడానికి బ్రిటన్ సిద్ధమైంది. ఇందుకోసం 30 బిలియన్ పౌండ్లు చెల్లించేందుకు తాము సిద్ధమని బ్రిటన్ ప్రధాని థెరెసా మే తెలిపారు. 2016, జూన్ 23న నిర్వహించిన రెఫరెండంలో ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకే మెజార్టీ ప్రజలు మొగ్గు చూపారు. దీంతో లాంఛనాలన్నీ పూర్తి చేసుకొని ఆ దేశం 2019 మార్చిలో ఈయూ నుంచి బయటకు రానుంది. ఈ సంధి కాలంలో ఈయూ బడ్జెట్‌కు 30 బిలియన్ పౌండ్లు సమకూర్చేందుకు థెరెసా మే అంగీకరించారు. దీనికి కేబినెట్ కూడా అంగీకరించింది.
Samayam Telugu theresa may will offer the eu 30billion in divorce payment
30 బిలియన్ పౌండ్లతో బ్రిటన్ విడాకుల ఒప్పందం?


రెండేళ్లపాటు బడ్జెట్ కోసం 90 బిలియన్ పౌండ్లు చెల్లించాలని ఈయూ డిమాండ్ చేస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం అమల్లోకి రావడం కోసం ఇందుకు అంగీకరించాలని ఈయూ నేతలు బ్రిటన్‌పై ఒత్తిడి తెస్తున్నారు.

బ్రిటన్ ప్రతిపాదనకు ఈయూ సభ్యదేశాలు ఆమోదం తెలుపుతాయని భావిస్తున్నట్లు మంత్రి డామియన్ గ్రీన్ తెలిపారు. బ్రిటన్ ఈయూ నుంచి వైదొలుతున్న ఈ సంధి కాలంలో ఏడాదికి కనీసం 10 బిలియన్ పౌండ్ల చొప్పున మూడేళ్లపాటు చెల్లించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తొలుత ప్రతిపాదించారు. ఈయూకు 30 బిలియన్ పౌండ్లు చెల్లించేందుకు బ్రిటన్ కేబినెట్ మంత్రులంతా అంగీకరించగా... విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.