యాప్నగరం

వర్క్ ఫ్రం హోంకి ఆ నగరాలే బెస్ట్..!

కోవిడ్ కారణంగా అందరి జీవితాలు మారిపోయాయి. దీంతో వర్క్ ఫ్రం హోం విధానం తెరపైకి వచ్చింది. చాలా సంస్థలు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంను ఇచ్చాయి. ఇప్పటికీ కొన్ని సంస్థలు కొనసాగిస్తున్నాయి. అయితే దాదాపు రెండేళ్లు కావడంతో.. ఇప్పుడు సంస్థలు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. కానీ ఉద్యోగులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఓ సంస్థ అధ్యయనం జరిపింది. ఆ స్టడీలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

Authored byAndaluri Veni | Samayam Telugu 26 May 2022, 9:57 pm

ప్రధానాంశాలు:

  • మొబైల్ కంపెనీ కిసీ అధ్యయనం
  • అత్యుత్తమ నగరంగా నిలిచిన సింగపూర్
  • దుబాయ్‌లో అధిక శ్రమ చేస్తోన్న ఉద్యోగులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu వర్క్ ఫ్రం హోంకి ఆ నగరాలే బెస్ట్..!
కరోనా ఎంట్రీతో మొత్తం జీవన గమనమే మారిపోయింది. ఆర్థికంగానే కాకుండా సామాజికంగా అనేక మార్పులు వచ్చేశాయి. అందులో ముఖ్యమైనది వర్క్ ఫ్రం హోం ఒకటి. (work from home) చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయమని అవకాశాన్ని కల్పించాయి. రెండేళ్లుగా సంస్థలు అలాగే కొనసాగాయి. ఇప్పడిప్పుడు కోవిడ్ కేసులు కంట్రోల్ కావడంతో సంస్థలు మళ్లీ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలుపునిస్తాయి. దీంతో ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
పని చేసే చోటు, పని విధానం అంశాల్లో ఉద్యోగుల స్వభావం మారిపోయింది. ఆఫీస్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో మారిన ఉద్యోగుల వైఖరిని పరిగణలోకి తీసుకుంటూ మొబైల్ యాక్సెస్ టెక్నాలజీ కంపెనీ కిసీ ఓ స్టడీ చేపట్టింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు వర్క్ ఫ్రం హోంకి ఏ నగరాలు అనుకూలంగా ఉన్నాయి. ఏవి అత్యంత చెత్తగా ఉన్నాయనే జాబితాను విడుదల చేసింది.

వర్క్ ఫ్రం హోంకి అత్యుత్తమ నగరాల్లోని మొదటి స్థానంలో సింగపూర్ నిలిచింది. తర్వాత వాషింగ్టన్, ఆస్టిన్, బెర్న్, జ్యూరిచ్, జెనీవా, శాన్‌ఫ్రాన్సిస్కో, బోస్టన్, స్టాక్ హోం, లివర్‌పూల్ వంటి నగరాలు వర్క్‌ఫ్రమ్ హోం అత్యుత్తమ నగరాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగులు పని చేయాల్సిన దానికంటే ఎక్కువగా పనిచేస్తున్న నగరాల్లో దుబాయ్ మొదటి స్థానంలో ఉంది. హాంగ్‌కాంగ్, కౌలాలంపూర్, సింగపూర్, మోంటెవిడియా, టోక్యో, బ్యాంకాక్, కేప్‌టౌన్, లిస్సెన్, బుడాపెస్ట్‌ వంటి నగరాల్లో ఉద్యోగులు చేయాల్సిన దానికంటే అధికంగా పని చేస్తున్నట్టు తెలిసింది.

ఒక వ్యక్తి తన ఉద్యోగ, వ్యక్తిగత జీవితానికి సమప్రాధాన్యత ఇస్తున్న నగరాలు గురించి అధ్యయనం చేయగా.. ఓస్లో మొదటి స్థానంలో ఉంది. అలాగే బెర్న్, హెల్సింకి, జ్యూరిచ్, కొపెన్‌హగెన్, ఒట్టవా, సిడ్నీ వంటి నగరాలున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.