యాప్నగరం

Philippines shooting: యూనివర్సిటీలో కాల్పులు... ముగ్గురు మృతి

ఫిలిప్పీన్స్‌లోని (Philippines shooting) యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్‌ డేలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దాంతో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నారు. మరోవైపు యూనివర్సిటీని క్లోజ్ చేశారు. అయితే లా స్కూల్ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండర్ గెస్ముండో హాజరుకావాల్సి ఉంది. కానీ తృటిలో ఆయనకు ప్రమాదం తప్పింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 24 Jul 2022, 4:33 pm
ఫిలిప్పీన్స్‌లో (Philippines shooting) కాల్పులు జరిగి... ముగ్గురు వ్యక్తులు మరణించారు. రాజధాని మనీలాలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం మధ్యాహ్నం కాల్పులు ఘటన చోటుచేసుకుంది. క్యూజోన్ సిటీలోని అటెనియో డి మనీలా యూనివర్సిటీ గేట్ దగ్గర ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దాంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఒకరరు గాయపడ్డారు. అలాగే కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu ప్రతికాత్మక చిత్రం


"కాల్పులు జరిపిన తర్వాత నిందితుడు కారులో పారిపోయేందుకు ప్రయత్నించాడని, అయితే పోలీసులకు పట్టుబడ్డాడని, ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నాం." అని స్థానిక పోలీసు అధికారి రెమస్ మదీనా అన్నారు. ఈ హత్యకు గురైన వ్యక్తుల్లో ఓ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, యూనివర్శిటీ సెక్యూరిటీ గార్డు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు.

అయితే లా స్కూల్ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండర్ గెస్ముండో హాజరు కావాల్సి ఉండగా.. కాల్పుల ఘటన తర్వాత రద్దు చేసుకున్నారు. కాల్పులు జరిగే సమయంలో ఆయన మార్గం మధ్యలో ఉన్నారు. వెనక్కి వెళ్లిపోమని అధికారులు ఆయనకు సూచించారు. అలాగే ఈ సంఘటన తర్వాత క్యాంపస్‌ను క్లోజ్ చేశారు. ఈ సందర్భంగా "ప్రస్తుతం క్యాంపస్ లాక్‌డౌన్‌లో ఉంది. ఫిలిప్పీన్స్ నేషనల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు." అని యూనివర్సిటీ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.