యాప్నగరం

గూగుల్ డూడుల్ క్రిస్మస్ సంబరాలు

క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులను గూగుల్ ఎంజాయ్ చేస్తోంది.

TNN 24 Dec 2016, 12:01 pm
క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులను గూగుల్ ఎంజాయ్ చేస్తోంది. గూగుల్ డూడుల్‌ను తన వెబ్ పేజ్‌లో పెట్టి ఎంత బాగా సెలవులను ఎంజాయ్ చేస్తోందో నెటిజెన్లకు చూపిస్తోంది. శుక్రవారం నుంచి ప్రారంభమైన క్రిస్మస్ సీజన్‌కు స్వాగతం చెబుతూ ‘టిస్ ద సీజన్’ అని ఒక డూడుల్‌ను ఉంచింది. అలాగే రెండో రోజు శనివారం కూడా ఒక ఆకర్షణీయమైన డూడుల్‌తో కనువిందు చేస్తోంది. ప్రాచాత్య దేశాల్లో డిసెంబర్ 23 నుంచి క్రిస్మస్ సీజన్ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి న్యూ ఇయర్ ప్రారంభం వరకు సెలవులు కొనసాగుతాయి. ఈ సీజన్‌లో క్రైస్తవులంతా ఎంతో ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటారు.
Samayam Telugu tis the season google doodle celebrates the christmas holidays
గూగుల్ డూడుల్ క్రిస్మస్ సంబరాలు


డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు జరుపుకునే సంబరాలకు సూచికలుగా గూగుల్ ప్రతి రోజూ ఒక డూడుల్‌ను తన హోం పేజీలో పెడుతుంది. ఇవో ఎంతో ఆకర్షణీయంగా, సరదాగా ఉంటాయి.

శుక్రవారం నాటి గూగుల్ డూడుల్

శనివారం గూగుల్ తన హోం పేజీలో ఉంచిన డూడుల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.