యాప్నగరం

ట్రూ ఫ్రెండ్: మోదీ కోసం ట్రంప్ రెడ్ కార్పెట్

అమెరికాకు ఒబామా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో మంచి స్నేహ బంధాన్ని నడిపారు.

TNN 25 Jun 2017, 9:35 am
అమెరికాకు ఒబామా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో మంచి స్నేహ బంధాన్ని నడిపారు. భారత్‌తో దౌత్త్య సంబంధాలను పెంచుకోవడానికి మొగ్గుచూపారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే చేయబోతున్నారు. మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన్ని ట్రంప్ తెగ మోసేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ప్రధాని మోదీ ఆదివారం ఉదయం వాషింగ్టన్ చేరుకున్నారు. అయితే మోదీ వాషింగ్టన్‌లో కాలుమోపడానికి ముందే ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
Samayam Telugu trump administration readies the red carpet for pm modi
ట్రూ ఫ్రెండ్: మోదీ కోసం ట్రంప్ రెడ్ కార్పెట్


‘భారత ప్రధాన మంత్రి మోదీని సోమవారం వైట్ హౌస్‌లోకి స్వాగతం పలకడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహాత్మక సమస్యల గురించి చర్చించాలి’ అని ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ (POTUS) అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్రంప్ ట్వీట్ చేశారు.
Look forward to welcoming India's PM Modi to @WhiteHouse on Monday. Important strategic issues to discuss with a true friend! — President Trump (@POTUS) June 24, 2017
మరోవైపు మోదీకి రెడ్ కార్పెట్ వేసేందుకు వైట్‌హౌస్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. సోమవారం వైట్ హౌస్‌లో ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ట్రంప్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసే విందు కార్యక్రమంలో పాల్గొనే తొలి దేశాధినేతగా నరేంద్ర మోదీ నిలిచారు. సోమవారం మధ్యాహ్నం ట్రంప్‌, మోదీ భేటీ కానున్నారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.

వాషింగ్టన్‌లో ఆదివారం తెల్లవారుజామున మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.