యాప్నగరం

వలసవాదులపై మరోసారి నోరుపారేసుకున్న ట్రంప్

ఉపాధి కోసం అమెరికా వచ్చే ఇతర దేశాల పౌరులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

TNN 12 Jan 2018, 12:07 pm
వలసవాదులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాలను పౌరులను చెత్త వలవాదులుగా అభివర్ణించారు. హైతీ, ఆఫ్రికా లాంటి చెత్త దేశాలకు చెందిన వలసవాదులను అమెరికాలోకి ఎందుకు అనుమతించాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కోవడం చర్చనీయాంశమైంది. ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలపై సెనెటర్లతో గురువారం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. నార్వేలాంటి దేశాలకు చెందిన వలసవాదులను అమెరికాలోకి ఆహ్వానించాలి కానీ ఆఫ్రికా, హైతీలాంటి చెత్త దేశాల నుంచి కాదని జాతివివక్ష వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచంలోనే మూడో ధనిక దేశమైన నార్వేకి వివిధ దేశాలకు చెందిన పౌరులు వలస వెళ్తుంటారు.
Samayam Telugu trump referred to haiti and african nations as shithole countries
వలసవాదులపై మరోసారి నోరుపారేసుకున్న ట్రంప్


నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్‌తో ట్రంప్‌ బుధవారం సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నార్వే వాసుల గురించి ప్రస్తావించడం గమనార్హం. ట్రంప్‌ వ్యాఖ్యలపై వైట్‌హౌస్‌ మీడియా ప్రతినిధి రాజ్‌షా స్పందిస్తూ.. కొందరు నేతలు విదేశాల కోసం పోరాడుతుంటారు కానీ ట్రంప్‌ మాత్రం అమెరికా ప్రజాల కోసమే పనిచేస్తారని తెలిపారు. అయితే ఎవరినీ కించపరచాలనేది ట్రంప్ ఉద్దేశం కాదని, మెరిట్ ప్రాతిపదిక ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఆయన సమర్థించారని పేర్కొన్నారు. హైతీ దేశస్థుల గురించి ట్రంప్ ఇలా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి కాదు. కొద్ది రోజుల కిందట హైతీ వాసులందరికీ ఎయిడ్స్‌ ఉందని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారమే రేగింది. ట్రంప్ వ్యాఖ్యలపై రిపబ్లికన్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ జాతిని కించపరిచేలా అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, అమెరికా అభివృద్ధిలో వేలాది మంది హైతీవాసులు కృషిని ట్రంప్ మరిచిపోతున్నారని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.