యాప్నగరం

పారిస్ ఒప్పందాన్ని రద్దు చేస్తా - ట్రంప్

చారిత్రక పారిస్ ఒప్పందంపై అమెరికా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

TNN 13 Oct 2016, 1:27 pm
న్యూయార్క్: పారిస్ పర్యావరణ ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే పారిస్ తో చేసుకున్న పర్యవరణ ఒప్పందాన్ని రద్దు చేస్తానని ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల అమెరికా 5.3 ట్రిలియన్లు నష్టపోతోందని.. ఆ నిధులతో అకాశనంటుతున్న విద్యుత్ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్లోరిడాలోని ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పారిస్ పర్యావరణ ఒప్పందంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిస్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నంత మాత్రాన తాను పర్యావరణ వ్యతిరేకి అనుకోవద్దని.. .. గతంలోనే తాను పర్యావరణ సంబంధిత అవార్డులు గెలుచుకున్నానని ట్రంప్ వెల్లడించారు.
Samayam Telugu trump says that he will scrap paris climate deal
పారిస్ ఒప్పందాన్ని రద్దు చేస్తా - ట్రంప్


పారిస్ ఒప్పందం వల్ల అమెరికా నష్టపోతుందని తెలిసి కూడా హిల్లరీ దాన్ని మద్దతివ్వడాన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. హిల్లరీకి దేశ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్ విమర్శించారు. ఏది ఏమైనా అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమన్న రీతిలో ట్రంప్ ప్రసంగం కొనసాగింది...

ఇప్పటికే మహిళలు, ముస్లింలు, నల్లజాతీయులకు వ్యతిరేక విధానాలు ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు తాజాగా పారిస్ ఒప్పందాన్ని వ్యతిరేకించి బ్రిటన్ తో సంబంధాలు
తెంచుకునే రీతిలో స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా ప్రతిష్ఠ దెబ్బతినేలా ఉందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.