యాప్నగరం

ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఈ దేశాల్లోనే!

​ అమెరికా అధ్యక్షుడిగా గత జనవరిలో బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటనకు మే నెలాఖరులో శ్రీకారం చుట్టనున్నారు

TNN 7 May 2017, 2:33 pm
అమెరికా అధ్యక్షుడిగా గత జనవరిలో బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటనకు మే నెలాఖరులో శ్రీకారం చుట్టనున్నారు. మొదటి విదేశీ పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్, వాటికన్, సౌదీ అరేబియాల్లో పర్యటించనున్నట్లు ట్రంప్ తెలిపారు. మే 25న బ్రస్సెల్స్‌లో జరగనున్న నాటో సమావేశాలు, సిసిలీలో జరగనున్న జీ7 సదస్సులో పాల్గొనడానికి ముందే ట్రంప్ ఈ దేశాల్లో పర్యటిస్తారు. వైట్‌హౌస్‌లో పాలస్తీనా నేత మహ్మద్ అబ్బాస్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదర్చడంలో సహకరిస్తానని అబ్బాస్‌కు అమెరికా అధ్యక్షుడు మాటిచ్చారు. వెంటనే ట్రంప్ తొలి విదేశీ పర్యటన వార్త బయటకు వచ్చింది.
Samayam Telugu trump to visit israel vatican and saudi arabia in first foreign trip
ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఈ దేశాల్లోనే!


‘నా తొలి పర్యటనలో భాగంగా ముందుగా సౌదీ అరేబియా వెళ్తాను. తర్వాత ఇజ్రాయెల్, రోమ్‌లోని వాటికన్ వెళ్తాను’ అని ట్రంప్ చెప్పారు. ఈ పర్యటనతో మధ్యప్రాచ్యం రాజకీయాల్లో వేలుపెట్టే దిశగా ట్రంప్ తొలి పర్యటన సాగనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో భేటీ కాగా, మార్చిలో సౌదీ అరేబియా రాకుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ వాషింగ్టన్ వెళ్లారు. అయితే పోప్ ఫ్రాన్సిస్ మాత్రం వలసలపై ట్రంప్ తీసుకొచ్చిన ఆంక్షలపై అసంతృప్తితో ఉన్నారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మూడు నెలల్లోనే బరాక్ ఒబామా మూడు పర్యటనలు చేయగా.. ట్రంప్ మాత్రం ఇప్పటి వరకూ విదేశీ పర్యటన పట్ల ఆసక్తి చూపలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.