యాప్నగరం

ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి రాగానే అమలు చేసిన ‘ట్రావెల్ బ్యాన్’కు సుప్రీం కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.

Samayam Telugu 5 Dec 2017, 3:46 pm
మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి రాగానే అమలు చేసిన ‘ట్రావెల్ బ్యాన్’కు సుప్రీం కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇరాన్‌, లిబియా, సిరియా, యెమన్‌, సోమాలియా, ఛాద్‌ దేశాల నుంచి ప్రజలెవరూ అమెరికా రాకుండా ఉండేలా ఈ ట్రావెల్ బ్యాన్‌ను రూపొందించారు. దీనిపై కొందరు ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన కోర్టులు ట్రావెల్‌ బ్యాన్‌లో కొన్ని సవరణలు చేశాయి. ఆ ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రక్త సంబంధికులకు అమెరికాలో శాశ్వత నివాసం ఉంటే వారికి అనుమతివ్వాలని చెప్పాయి.
Samayam Telugu trump travel ban us supreme court allows full enforcement of trump travel ban
ట్రంప్ ట్రావెల్ బ్యాన్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్!


అయితే, తాజా తీర్పులో సుప్రీంకోర్టు ఆ సవరణలను కూడా ఎత్తివేసి, పూర్తిస్థాయిలో ట్రావెల్ బ్యాన్‌ను అమలు చేయాలని పేర్కొంది. న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని ఆదేసించింది. ముస్లిం మెజార్టీ దేశాల నుంచి ప్రజలు అమెరికా రాకుండా ఉండేందుకు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికీ ఆ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. సుప్రీం తీర్పుతో ఇప్పటికే అక్కడ స్థిరపడిన ఆ ఆరు దేశాల ప్రజలు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.