యాప్నగరం

జపాన్‌లో భూకంపం: ఫుకుషిమాను తాకిన సునామి

పాన్‌ను మరోసారి సునామీ తాకింది. మంగళవారం ఉదయం జపాన్ సముద్ర తీరంలో 7.4 మెగ్నిట్యూట్‌తో భూకంపం ఏర్పడింది.

TNN 22 Nov 2016, 12:51 pm
పాన్‌ను మరోసారి సునామీ తాకింది. మంగళవారం ఉదయం జపాన్ సముద్ర తీరంలో 7.4 మెగ్నిట్యూట్‌తో భూకంపం ఏర్పడింది. దీంతో ఈశాన్య సముద్ర తీరంలోని ఫుకుషిమా పరిసర ప్రాంతాలను సునామీ తాకింది. భూకంపం ఏర్పడిన వెంటనే సముద్ర తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. భూకంపం వల్ల ఇప్పటి వరకు 12 మందికి గాయపడ్డారు. అయితే, సునామీ తీవ్రత తక్కువగా ఉండటంతో హెచ్చరికలు ఉపసంహరించుకున్నారు.
Samayam Telugu tsunami hits japan after strong earth quake
జపాన్‌లో భూకంపం: ఫుకుషిమాను తాకిన సునామి


2011లో ఇదే ప్రాంతంలో 9.0 మేగ్నిట్యూట్‌తో ఏర్పడిన భూకంపం వల్ల తీర ప్రాంతాలను సునామీ ముంచెత్తింది. సుమారు 18వేల మంది ప్రాణాలు విడిచారు. మంగళవారం ఏర్పడిన భూకంపం వల్ల జపాన్‌లో పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. టోక్యో నగరంలోని భవనాలు ఊగిపోయాయి. గత సునామీ మిగిల్చిన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టకుని ఫుకుషిమాలోని అణు విద్యుత్తు కర్మాగారాన్ని మూసివేశారు. అయితే, 2011తో పోల్చితే.. మంగళవారం ఏర్పడిన సునామీ అంత ప్రమాదకరం కాకపోవడం గమనార్హం. అలల తీవ్రత కూడా తక్కువగా ఉండటంతో జపాన్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.