యాప్నగరం

Tesla: డ్రైవర్ రహిత కారులో ఇద్దరి సజీవ దహనం.. షాకింగ్

డ్రైవర్ లెస్ కారు ప్రమాదానికి గురైంది. అతివేగంగా వచ్చిన కారు మలుపు వద్ద తన దిశను మార్చుకోకుండా నేరుగా వెళ్లి చెట్టుని ఢీకొట్టింది. మంటలు చెలరేగి కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

Samayam Telugu 19 Apr 2021, 6:27 pm
సెల్ఫ్ డ్రైవింగ్ (డ్రైవర్‌ రహిత) సదుపాయం కలిగిన టెస్లా కారు ఘోర ప్రమాదానికి గురైంది. మలుపు వద్ద అతివేగంగా వచ్చి ఎదురుగా చెట్టును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. న్యూయార్క్‌లోని టెక్సాస్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కారులోనే సజీవదహనమయ్యారు. నార్త్ హ్యూస్టన్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు మలుపు వద్ద నేరుగా దూసుకెళ్లి చెట్టుని బలంగా ఢీకొట్టింది. కారు ఢీకొన్న ధాటికి వెంటనే మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
tesla car


అయితే కారులో డ్రైవర్ లేడని.. డ్రైవింగ్ అసిస్టెన్స్ మోడ్‌లో కారు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలకు ఆహుతైన వ్యక్తుల్లో ఒకరు ముందు ప్యాసింజర్ సీటులో కూర్చోగా.. మరొకరు వెనక సీట్లో కూర్చున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ సీటులో ఎవరూ లేరని చెప్పారు. విచారణ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. అయితే డ్రైవింగ్ అసిస్టెన్స్ మోడ్ పూర్తిగా తనంతట తాను పని చేయదని.. ఓ డ్రైవర్ పర్యవేక్షణ ఉండాలని టెస్లా వెబ్‌సైట్‌లో ఉండడం గమనార్హం.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.