యాప్నగరం

సరస్సులో మోదీ, జిన్‌పింగ్ పడవ విహారం...!

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు రెండు రోజుల చైనా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటిరోజు వుహాన్‌ నగరంలో పర్యటించిన మోదీ... రెండోరోజు పర్యటనలో భాగంగా జిన్‌పింగ్‌తో కలిసి మోదీ పడవలో విహరించారు. వుహాన్‌ నగరంలోని 'ఈస్ట్ లేక్' వద్ద ఇరువురు నేతలు నదీతీరం వెంబడి నడుస్తూ కాసేపు మాట్లాడుకున్నారు.

TNN 28 Apr 2018, 12:49 pm
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు రెండు రోజుల చైనా పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటిరోజు వుహాన్‌ నగరంలో పర్యటించిన మోదీ... రెండోరోజు పర్యటనలో భాగంగా జిన్‌పింగ్‌తో కలిసి పడవలో విహరించారు. వుహాన్‌ నగరంలోని 'ఈస్ట్ లేక్' వద్ద ఇరువురు నేతలు తీరం వెంబడి నడుస్తూ కాసేపు మాట్లాడుకున్నారు. 'చాయ్ పే చర్చా' అన్నట్లు... తేనీరు తాగుతూ ముచ్చటించారు.
Samayam Telugu చాయ్ పే చర్చా

అనంతరం... రెండస్థుల పడవలో 'ఈస్ట్ లేక్' సరస్సులో విహారానికి వెళ్లారు. దాదాపు గంటపాటు పడవ ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా వీరు పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మధ్యాహ్నం మోదీ గౌరవార్థం జిన్‌పింగ్ విందు ఇవ్వనున్నారు. తదనంతరం మోదీ భారత్‌కు బయలుదేరనున్నారు.
చైనా అధ్యక్షుడితో అనధికార చర్చల్లో పాల్గొనడం గొప్ప అవకాశమని మోదీ ఈ సందర్భంగా అన్నారు. మోదీని అనధికారిక పర్యటనకు ఆహ్వానించి జిన్‌పింగ్‌ చైనా-భారత్‌ సంబంధాల విషయంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని... ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభనలు తొలగి, పరస్పరం విశ్వాసాన్ని పెంచడానికి మోదీ పర్యటన ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.