యాప్నగరం

పటిష్ట చర్యలు చేపట్టకపోతే 2 కోట్ల మంది కరోనాకు బలవుతారు.. డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్

ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకూ దాదాపు 10 లక్షల మంది చనిపోయారు. ఈ సంఖ్య రెట్టింపు కాకుండా ఉండాలంటే సరైన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.

Samayam Telugu 26 Sep 2020, 11:33 am
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారికి 20 లక్షల మంది బలైపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రపంచంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 10 లక్షలకు చేరువయ్యాయని, ఒకవేళ మహమ్మారి సంయుక్తంగా ఎదుర్కోకపోతే మరో 10 లక్షల మరణాలు ఊహించలేమని వ్యాఖ్యానించింది.
Samayam Telugu కరోనా వైరస్


‘ఒక్క మిలియన్ మరణాలే భయంకరమైనవి.. ఇది రెండో మిలియన్‌కు చేరుకోకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది’అని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం డైరెక్టర్ మైఖేల్ రియాన్ అన్నారు. శుక్రవారం ఆయన విర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్‌తో రెండు కోట్ల మంది చనిపోతారని ఊహించగలరా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఒకవేళ సరైన చర్యలు తీసుకోకపోతే.. అంతకంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతారు.. ఇది చాలా బాధాకరం. ఇవన్నీ చేయకపోతే, మీరు మాట్లాడిన సంఖ్య ఊహించగలం, కానీ, దురదృష్టవశాత్తు చాలా అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌తో ఇప్పటి వరకూ 9.93 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 2.42 కోట్ల మంది వైరస్ బారినపడగా.. 2.40 కోట్ల మంది కోలుకున్నారు.

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారీకి నిధులు సమకూర్చడం, ఉత్పత్తి, పంపిణీ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ తొమ్మిది నెలల్లోనే 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం పరిశీలిస్తే, రాబోయే తొమ్మిది నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం పెద్ద సవాల్ అని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.