యాప్నగరం

కాఠ్మండు విమానాశ్రయం వద్ద కూలిన విమానం

నేపాల్ రాజధాని కాఠ్మండు విమానాశ్రయం వద్ద బంగ్లాదేశ్‌కు చెందిన విమానం కూలిపోయింది.

Samayam Telugu 12 Mar 2018, 3:37 pm
నేపాల్ రాజధాని కాఠ్మండు విమానాశ్రయం వద్ద బంగ్లాదేశ్‌కు చెందిన విమానం కూలిపోయింది. కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ధాటికి విమానం నుంచి దట్టమైన పొగలు ఆకాశాన్ని తాకాయి. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది కొంత మందిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రాణం నష్టం జరిగే ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఎంత మంది చనిపోయారనే విషయంలో ఇంకా స్పష్టతలేదు. విమానంలో మొత్తం 76 మంది ప్రయాణికులన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu us bangla plane crash at nepals kathmandu airport
కాఠ్మండు విమానాశ్రయం వద్ద కూలిన విమానం


సోమవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి యూఎస్-బంగ్లా సంస్థకు చెందిన ఎస్2-ఏజీయూ పాసింజర్ విమానం బయలుదేరింది. మధ్యాహ్నం 2.20 గంటలకు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండ్ అవుతుండగా రన్‌వేపై అదుపుతప్పింది. నిప్పులు చిమ్ముతూ రన్‌వేకు సమీపంలో ఉన్న ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమైంది. 17 మంది ప్రయాణికులను రక్షించి చికిత్స నిమిత్తం పలు హాస్పిటల్స్‌కు పంపినట్లు టూరిజం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సురేశ్ ఆచార్య మీడియాకు తెలిపారు. సాంకేతిక కారణల వల్లే ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి ఉంటుందని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.