యాప్నగరం

APT T3X అందుబాటులోకి కరోనాను నాశనం చేసే ఆయింట్‌మెంట్.. 30 సెకెన్లలోనే వైరస్ అంతం!

కరోనా మహమ్మారిని కట్టడిచేసే ఆయుధం కోసం వివిధ దేశాలకు చెందిన పరిశోధనలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో పలు సంస్థలు సానుకూల ఫలితాలను సాధిస్తున్నాయి.

Samayam Telugu 22 Aug 2020, 1:45 pm
ప్రాణాంతక కరోనా వైరస్‌కు మెరుగైన చికిత్సా విధానం, టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా, అమెరికా శాస్త్రవేత్తలు కోవిడ్-19ను అడ్డుకునే ఆయింట్‌మెంట్‌ను తయారు చేశారు. దీనికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం లభించింది. ఏపీటీ టీ3ఎక్స్ పేరుతో ఆయింట్‌మెంట్‌ను మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చారు. ముక్కు ద్వారా సంక్రమించే కరోనా వైరస్‌ బారిన పడకుండా అడ్డుకోడానికి అభివృద్ధి చేసిన ఈ ఆయింట్‌మెంట్‌ను ఔషధాల దుకాణంలో వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవచ్చు.. ఎవరైనా వాడుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.
Samayam Telugu కరోనా వైరస్


ఈ ఆయింట్‌మెంట్‌ సాయంతో చికిత్స చేసిన 30 సెకన్ల అనంతరం కరోనా వైరస్‌ ఆనవాళ్లు కనిపించలేదని ప్రయోగశాల నివేదికల ద్వారా తెలిసిందని అడ్వాన్స్‌డ్‌ పెనెట్రేషన్‌ టెక్నాలజీ సంస్థ సీఈవో డాక్టర్‌ బ్రియాన్‌ హ్యూబర్ వ్యాఖ్యానించారు. ఈ ఆయింట్‌మెంట్ ఓ మంచి ఆవిష్కరణ అని, కరోనా నుంచి ఇటువంటి రక్షణ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ ఆయింట్‌మెంట్ ముందు వరుసలో నిలబడుతుందని హ్యూబర్ చెప్పారు. ఎక్కువ మందికి ముక్కు ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందని, ఈ ఆయింట్‌మెంట్‌తో అడ్డుకోవచ్చని అన్నారు. ఈ ఆయింట్‌మెంట్ కరోనా వైరస్‌తో పాటు ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌లపై కూడా సమర్ధంగా పని చేస్తోందని పరిశోధకులు తెలిపారు. ఈ ఆయింట్‌మెంట్‌ను వాడిన కొన్ని క్షణాలలోనే అది కరోనా విస్తరించే శక్తిని నాశనం చేస్తోందని వివరించారు.

కోవిడ్-19, ఇతర వైరస్‌లు ప్రాథమికంగా ముక్కు ద్వారానే వ్యాప్తి చెందుతుందని ఇటీవల మస్సాచు‌సెట్స్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అధ్యయనంలో వెల్లడయ్యింది. దీంతో పాటు నోరు, కళ్ల ద్వారా కూడా సంక్రమిస్తుంది. లండన్‌కు చెందిన వైరాలజీ రిసెర్చ్ సర్వీసెస్ ల్యాబొరేటరీ సైతం ఈ ఆయింట్‌మెంట్ పనితీరును పరిశీలించగా.. కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా అడ్డుకుంటోందని ధ్రువీకరించిందని అన్నారు. సెకెన్లలోనే వైరస్‌ను ఏపీటీ టీ3ఎక్స్ ఆయింట్‌మెంట్ నిర్వీర్యం చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.