యాప్నగరం

28 ఏళ్లకే 9 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. వీడియో వైరల్

19 వ శతాబ్దంలోనే కుటుంబనియంత్రణ మొదలైంది. ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు పిల్లలే ముద్దని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు కల్పించడం కష్టంగా మారింది. కానీ, కొద్ది మంది మాత్రం తమకు ఎక్కువ పిల్లలు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కోవకు చెందిందే అమెరికా జంట. ఓ మహిళ 28 ఏళ్ల వయసుకే తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన 39 ఏళ్ల కోరా డ్యూక్‌.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 20 Mar 2023, 9:28 am

ప్రధానాంశాలు:

  • చదువుకున్న సమయంలో చిగురించిన ప్రేమ
  • 17 ఏళ్లకు మొదటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
  • వరుసగా పదేళ్ల వ్యవధిలోనే 9 మంది పిల్లలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kora Duke
ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు పడిపోతున్నాయి. చాలా మంది దంపతులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారు. 19 వ శతాబ్దంలోనే కుటుంబనియంత్రణ మొదలైంది. కానీ, కొద్ది మంది మాత్రం తమకు ఎక్కువ పిల్లలు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కోవకు చెందిందే ఇప్పుడు చెప్పుకోబోయే జంట. ఓ మహిళ 28 ఏళ్ల వయసుకే తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన 39 ఏళ్ల కోరా డ్యూక్‌.. 2001లో పదిహేడేళ్ల వయసులో మొదటిసారి గర్భం దాల్చి బిడ్డను ప్రసవించింది. 2012లో చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, మూడో సంతానంగా పుట్టిన బిడ్డ ఏడు రోజులకే చనిపోయింది.
ప్రస్తుతం తన భర్త ఆండ్రే డ్యూక్‌, తన 8 మంది పిలలతో కలిసి లాస్ వేగాస్‌లో నివసిస్తోంది. ఇటీవల తన బిడ్డలతో కలిసి కోరా చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వయసుల వారీగా పిల్లలను వరుసగా నిల్చోబెట్టి వారిని పరిచయం చేస్తూ తీసిన ఆ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. ఉద్దేశపూర్వకంగా తాను ఇంత మంది పిల్లలను కనలేదని కోరా వెల్లడించింది. సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతులు విఫలం కావడం వల్లే ఇన్ని సార్లు గర్భం ధరించినట్లు తెలిపింది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నట్లు చెప్పింది.

చదువుకున్న రోజుల్లోనే ఆండ్రే డ్యూక్, కోరాల మధ్య ప్రేమ చిగురించింది. ఒకే పాఠశాలలో చదువుకున్న వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2001లో వివాహం కాగా.. . అదే ఏడాది మొదటి బిడ్డకు జన్మనిచ్చారు కోరా. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఏటా సగటున ఓ బిడ్డను కన్నారు. ఇప్పుడు మొదటి బిడ్డ ఎలిజా వయసు 21. రెండో కుమార్తె షేనా వయసు 20 ఏళ్లు. జాన్ (15), కైరో (15), సయా (14), అవి (13), రోమని (12), తాజ్ (10) పిల్లలు ఉన్నారు. 2004లో పుట్టిన మూడో సంతానం వారం రోజులకే చనిపోయింది.

మాతృత్వం తనకు సహజంగా వచ్చింది.. నా భర్త సహకారంతో అనేక అడ్డంకులను అధిగమించాను అని కోరా తెలిపారు. తన పిల్లలను పరిచయం చేస్తూ పెట్టిన వీడియోపై పలువురు విమర్శలు కూడా గుప్పించారు. వరుగా పదేళ్లలో 9 మందిని ఎలా కన్నావని ప్రశ్నిస్తున్నారు. ‘నా గర్భధారణ సమయంలో నేను దేనిపైనా దృష్టి పెట్టలేదు.. అది నా ఆరోగ్యంపై ప్రభావం చూపింది.. నేను చిన్న వయసులో ఉండటం అదే నాకు ఓదార్పునిచ్చింది. నాకు ధైర్యాన్ని కూడా ఇచ్చింది.. నేను తరచుగా అనారోగ్యానికి గురయ్యాను... నా కుటుంబం నాకు మద్దతుగా నిలవడం వల్ల నేను ఇది సాధించాను’ అని సమాధానం ఇచ్చారు.

View this post on Instagram A post shared by Kora Duke 🇮🇳 (@mzkora)

Read More Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.