యాప్నగరం

అమెరికాను హడలెత్తిస్తున్న కొర్రమేను చేప.. కనపడగానే చంపేయాలని ఆదేశాలు!

Murrel Fish | కొర్రమేను జాతికి చెందిన చేప అమెరికాను హడలెత్తిస్తోంది. ఈ చేప కనిపించగానే చంపేయండని అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక చేపలకు దీని నుంచి ముప్పు ఎదురవుతుండటమే దీనికి కారణం.

Samayam Telugu 14 Oct 2019, 5:13 pm
మన దగ్గర లభ్యమయ్యే కొర్రమేను చేపల ప్రత్యేకత తెలుసు కదా. ఇది నీరు లేకపోయినా.. బురదలోనైనా బతకగలదు. కొర్రమేను లాంటి చేపను చూసి అమెరికా హడలిపోతోంది. స్నేక్ ఫిష్‌గా పిలిచే ఈ చేప అమెరికన్లను భయపెడుతోంది. ఇది భూమి మీద పాకుతూ ఒక నీటి మడుగు నుంచి మరో మడుగుకు ప్రయాణించగలదు. నీళ్లు లేకున్నా గాలిని పీలుస్తూ బతికేయగలదు. ఈ చేప కనిపించగానే చంపేయండని అధికారులు ప్రజలను కోరుతున్నారు.
Samayam Telugu murrel snake head fish


ఎందుకబ్బా.. అనుకుంటున్నారా? ఈ స్నేక్ ఫిష్ దెబ్బకు స్థానికంగా ఉండే చేపలకు ముప్పు వాటిల్లుతోందట. ఇవి వేగంగా తమ సంతతిని పెంచుకుంటూ.. ఇతర జాతి చేపలు, జలచరాలను తినేస్తున్నాయట. తమ పిల్లల జోలికి వచ్చే ఇతర జీవుల అంతు చూస్తున్నాయట. దీంతో జీవ వైవిధ్యం దెబ్బతింటోందని అధికారులు వాపోతున్నారు. మొత్తం 15 రాష్ట్రాల్లో ఈ చేపలు ఉన్నట్టు గుర్తించారు. ఇటీవలే తొలిసారిగా జార్జియాలోనూ ఈ చేపను గుర్తించారు.

వాస్తవానికి ఇవి అమెరికాకు చెందిన చేపలు కాదు. ఆసియా ప్రాంతం నుంచి ఇవి అమెరికాలో అడుగుపెట్టాయి. 2002లో అమెరికా ఈ జాతి చేపలపై నిషేధం విధించింది. ఇతర జీవులకు హాని కలిగిస్తున్నాయనే కారణంతో వాటి రవాణాపై ఆంక్షలు విధించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.