యాప్నగరం

నేడు మోడీతో ఫోన్‌లో మాట్లాడనున్న ట్రంప్

డోనాల్డ్ ట్రంప్ నేడు భారత ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడనున్నారు.

TNN 24 Jan 2017, 3:09 pm
అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ నేడు భారత ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడనున్నారు. అధ్యక్షునిగా నాలుగు రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ ఇప్పటివరకు నాలుగు దేశాల అధ్యక్షులతో మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాట్లాడబోతున్న అయిదో దేశాధినేత మోడీ. కాగా ట్రంప్ రోజు వారీ షెడ్యూల్ ను వైట్ హౌస్ విడుదల చేసింది. ఈ రోజు ఆయన చేసే పనుల్లో ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడనున్నట్టు కూడా మీడియాకు విడుదల చేసిన స్టేట్ మెంట్ లో ఉంది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ట్రంప్ మోడీకి ఫోన్ చేస్తారు. ఇది మన కాలమానం ప్రకారం రాత్రి 11.30.
Samayam Telugu us president donald trump will speak to pm modi today
నేడు మోడీతో ఫోన్‌లో మాట్లాడనున్న ట్రంప్


గతేడాది నవంబర్ లో ట్రంప్, మోడీలు మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ను అభినందించేందుకు మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. తరవాత మళ్లీ వీరిద్దరికి మాట్లాడే అవకాశం రాలేదు.

అధ్యక్షనిగా ప్రమాణ స్వీకారం చేశాక ట్రంప్ మొదటిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో మాట్లాడారు. అనంతరం మెక్సికో అధ్యక్షుడు పెనా నీటో, ఇజ్రామెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్ సిసితో ఫోన్ లో సంభాషించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.