యాప్నగరం

అమెరికా ఎన్నికలు: జో బిడెన్ గెలవబోతున్నారా.. ఆ సంకేతాలేమిటి?

Donald Trump VS Joe Biden: అమెరికా ఎన్నికలు అంతకంతకూ ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. సర్వేలన్నీ జో బిడెన్‌కే ఆధిక్యం కట్టబెట్టాయి.

Samayam Telugu 3 Nov 2020, 11:56 pm
మెరికా ఎన్నికలను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. కరోనా సంక్షోభం వేళ వచ్చిన విమర్శలను తట్టుకొని డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా? లేదా అమెరికా ఓటర్లు మార్పు కోరుతూ జో బిడెన్ వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తిగా మారింది. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రోజురోజుకూ అంచనాలు మారుతున్నాయి. ఒక దశలో డెమోక్రాటిక్ అభ్యర్థులు జో బిడెన్, కమలా హీరిస్ ఎన్నికల ప్రచారంలో ముందంజలో నిలిచారు. కానీ, చివరి గంటల్లో ట్రంప్ తనదైన ప్రచారంతో దూసుకొచ్చారు.
Samayam Telugu అమెరికా ఎన్నికలు
US Elections


అమెరికా ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి ముందస్తు ఓట్లు నమోదయ్యాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎక్కువ మంది ముందస్తు ఓటు వినియోగించుకునేలా అధికారులు అవకాశం కల్పించారు. 23.9 కోట్ల ఓటర్లుండగా.. ఇప్పటికే 10 కోట్ల మంది ముందస్తు ఓటేశారు.

ముందస్తు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనికి విరుద్ధంగా ఓటింగ్‌లో పాల్గొనాలని తన మద్దతుదారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఓట్లు ఎక్కువగా నమోదవడం ఆసక్తికర చర్చకు తావిస్తోంది. అది జో బిడెన్ గెలుపునకు సంకేతం అని డెమోక్రాట్లు దీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సర్వేలన్నీ ఆయనకే పట్టం కట్టాయి. స్వల్ప తేడాతో జో బిడెన్‌కే ఆధిక్యం కట్టబెట్టాయి. అయితే.. అవి ట్రంప్ గెలిచే అవకాశాలను కొట్టిపారేయలేదు.


ఇలాంటి పరిణామాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చివరి రోజున దూకుడు పెంచారు. తన అస్త్రాలన్నింటినీ సంధించారు. జో బిడెన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఆయన అధికారంలోకి వచ్చినా కమలా హారిసే ఏలుతారని కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చి ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కించారు. వోట్ ఫర్ 4 ఇయర్స్ అంటూ డ్యాన్స్ చేస్తూ తన మద్దతుదారులను ఉత్సాహపరిచారు. ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ట్రంప్ పిలుపు అందుకొని ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం (నవంబర్ 3) సాయంత్రం 4.30 గంటలకు అమెరికా ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. 2016తో పోలిస్తే ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ బాగా పెరుగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న పోలింగ్ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ఓటర్లు ట్రంప్ వైపే మొగ్గు చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని రిపబ్లికన్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.