యాప్నగరం

ట్రంప్‌ను ఓడించేందుకు సహకరిస్తా: బఫెట్

వారెన్ బఫెట్... సిరిసంపదలకు ఆయన చిరునామా. అగ్ర దేశమైన అమెరికాలో కుబేరుడాయన.

TNN 2 Aug 2016, 8:46 am
వారెన్ బఫెట్... సిరిసంపదలకు ఆయన చిరునామా. అగ్ర దేశమైన అమెరికాలో కుబేరుడాయన. అలాంటి వ్యక్తి హిల్లరీకి అండగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ ను ఓడించేందుకు తానే నేరుగా ప్రచారానికి వస్తున్నారు. అదే కాకుండా... ట్రంప్ ను ఓడించేందుకు నేను కృషి చేస్తా... అంటూ బహిర్గతంగా వ్యాఖ్యలు కూడా చేశారు. నెబ్రస్కాలో హిల్లరీతో పాటూ ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ ను ఓడించేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారిని దగ్గరుండి తీసుకెళ్లి వారిచేత ఓటు వేయిస్తానని అన్నారు. నెబ్రస్కాలో 32 సీట్లు ఉన్న ట్రాలీని పోలింగ్ రోజుకోసం సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. ట్రంప్ తన ఆదాయపన్ను రిటర్నులను ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు.
Samayam Telugu warren buffett campaigns with hillary clinton to defeat trump
ట్రంప్‌ను ఓడించేందుకు సహకరిస్తా: బఫెట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.