యాప్నగరం

ట్రంప్ భద్రతా సలహాదారుకు కరోనా పాజిటివ్

White House: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో కరోనా కలకలం రేగింది. డొనాల్డ్ ట్రంప్ భద్రతా సలహాదారుడు రాబర్ట్ ఒబ్రెయిన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

Samayam Telugu 27 Jul 2020, 9:14 pm
మెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌లో కరోనా అలజడి రేగింది. డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుడు రాబర్ట్ ఒబ్రెయిన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని.. సురక్షిత ప్రాంతం నుంచి తన విధులు కొనసాగిస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు సోమవారం (జులై 27) తెలిపాయి. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న అమెరికాలో.. ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడ్డ అతున్నత స్థాయి అధికారి ఈయనే కావడం గమనార్హం.
Samayam Telugu వైట్ హౌస్
White House


రాబర్ట్ ఒబ్రెయిన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో వైట్ హైస్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. అయితే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గానీ, ఉపాధ్యక్షుడికి గానీ కరోనా రిస్క్ ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. జాతీయ భద్రతా మండలి పని నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

రాబర్ట్ ఒబ్రెయిన్ ఇటీవల యూరప్‌లో పర్యటించారు. యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీకి చెందిన అధికారులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన వైరస్ బారిన పడినట్లు భావిస్తున్నారు.

Also Read: మిరాకిల్ ఎస్కేప్.. అతడికి భూమి మీద నూకలున్నాయి

Must Read: పాన్ మసాలా కోసం పారిపోయిన కరోనా రోగి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.