యాప్నగరం

అదే కొంప ముంచింది.. రెండేళ్లలోపే కరోనాకు అంతం: డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు

ప్రాణాంతక కొత్త రకం కరోనా వైరస్‌కు ప్రస్తుతం వ్యాాక్సిన్, చికిత్స విధానం కోసం ముమ్మ ర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు చేసింది.

Samayam Telugu 22 Aug 2020, 9:32 am
చైనాలో గతేడాది డిసెంబరు చివరిలో వెలుగుచూసిన కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఈ మహమ్మారికి ఎప్పుడు? ఎలా? అంతమవుతోందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రపంచం రెండేళ్లలోపు విముక్తి పొందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది స్పానిష్ ఫ్లూ కంటే వేగంగా అంతమయ్యే సూచనలు ఉన్నాయని శుక్రవారం వ్యాఖ్యానించింది.
Samayam Telugu డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్
WHO on Coronavirus


Read Also: సరిహద్దుల్లో ప్రతిష్టంభనపై చర్చలు.. చైనా దారికి వస్తుందని బలంగా నమ్ముతున్న భారత్

ఈ మహమ్మారి రెండేళ్లలోపు అంతమవుతుందని ఆశిస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ ఘ్యాబ్రియోసిస్ అన్నారు. జెనివాలోని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కొత్తరకం కరోనా వైరస్ 1918లో విజృంభించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి కంటే వేగంగా అవగాహన చేసుకోవడం సాధ్యమని అన్నారు.

Read Also: కోవిడ్ కేసుల్లో మరో రికార్డ్ దిశగా భారత్.. కేవలం 16 రోజుల్లోనే

నాటి పరిస్థితులతో పోలిస్తే, ఈ రోజున ‘ప్రపంచీకరణ, సాన్నిహిత్యం, అనుసంధానం’ కారణంగా ప్రపంచానికి ప్రతికూలంగా మారిందని, దీని వల్ల కరోనా వైరస్ మెరుపు వేగంతో వ్యాపించడానికి వీలు కల్పించిందని టెడ్రోస్ పేర్కొన్నారు. కానీ, ప్రపంచం ఇప్పుడు చాలా మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనాన్ని కలిగి ఉందన్నారు.

Read Also: చైనాకు కేంద్ర మరో షాక్.. వందే భారత్ రైళ్ల టెండర్ రద్దు
అందుబాటులో ఉన్న సాధనాలను గరిష్ఠంగా ఉపయోగించడం, వ్యాక్సిన్లు వంటి అదనపు సాధనాలు అందుబాటులోకి వస్తే 1918 ఫ్లూ కంటే తక్కువ సమయంలో దాన్ని పూర్తిగా పారద్రోలగలమని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2.30 కోట్లకు చేరుకోగా.. 8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Read Also: చైనా రాజధానిలో ఇక మాస్కులు అక్కర్లేదట.. కరోనా పూర్తిగా తగ్గుముఖం!

కానీ, ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన మహమ్మారిగా స్పానిష్ ఫ్లూ నిలిచింది. 50 కోట్ల మంది ఈ వైరస్ బారినపడగా.. ఐదు కోట్ల మంది చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినవారి కంటే ఇది ఐదు రెట్లు ఎక్కువ. మహమ్మారి ఐరోపాలో వ్యాపించడానికి ముందు అమెరికాలోనే తొలి బాధితులను గుర్తించారు. మూడు దశల్లో మహమ్మారి విజృంభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.