యాప్నగరం

ఏడాదిలోగా కరోనా వ్యాక్సిన్.. అందరికీ అందడం సవాలే: WHO

ఏడాదిలోగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ అథానోమ్ తెలిపారు. ప్రస్తుతం 13 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని తెలిపారు.

Samayam Telugu 26 Jun 2020, 8:16 pm
రోనా మహమ్మారికి ఏడాదిలోగా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది. మరో 13 వ్యాక్సిన్లు ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని తెలిపింది. 129 వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని ప్రకటించింది. క్లినికల్‌ దశలో ఉన్నవాటిలో.. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్‌, చైనాకు చెందిన సినోవాక్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ వచ్చే నెలలో తుది దశకు చేరనున్నాయని తెలిపింది.
Samayam Telugu డబ్ల్యూహెచ్‌ఓ
WHO


కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి రావడం సవాలేనని డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథానోమ్‌ గెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. ఇందుకు రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉన్నవారికి, బలహీనులకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడాన్ని ఓ ప్రత్యేక అంశంగా పరిగణించాలని సూచించారు. పర్యావరణం, ప్రజారోగ్యం, ఆహార భద్రతపై ఏర్పాటైన ఐరోపా పార్లమెంట్‌ కమిటీ సమావేశంలో గురువారం (జూన్ 25) ఆయన మాట్లాడారు.

కరోనా మహమ్మారి అనేక పాఠాలను నేర్పిందని అథానోమ్ పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలన్నారు. దేశాలన్నీ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే అత్యవసర సన్నద్ధత కూడా ఉండాలని తెలిపారు. అంతర్జాతీయ సౌభ్రాతృత్వ అవసరాన్ని కొవిడ్-19 మహమ్మారి గట్టిగా చెప్పిందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ఇప్పటికీ ప్రపంచమంతా తిరుగుతోందని వ్యాఖ్యానించారు.

ఐరోపా పార్లమెంటు సభ్యుల్లో పలువురు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాముఖ్యం గురించి మాట్లాడారు. మహమ్మారి విషయంలో సంస్థ స్పందన సరిగ్గా లేదని మరికొందరు విమర్శించారు. దీనిపై అథానోమ్ స్పందిస్తూ.. తప్పులు అందరూ చేస్తారని అంగీకరించారు. మహమ్మారి విషయంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ఒక స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. త్వరలోనే అది పని ప్రారంభిస్తుందని తెలిపారు.

Also Read: ముంబై పేలుళ్ల నిందితుడు యూసఫ్ మెమన్ మృతి

Must Read: స్విస్ బ్యాంకులో భారీగా తగ్గిన భారతీయుల నగదు.. ముందే సర్దుకున్నారా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.