యాప్నగరం

విప్‌ గొంగిడి సునీతకు తప్పిన ప్రమాదం..

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు, మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె స్వల్పగాయాలతో బయటపడ్డారు.

Samayam Telugu 7 Jun 2018, 12:50 am
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు, మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు మీదుగా నాగోలుకు వెళ్తుండగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్ వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఓ వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సునీతా మహేందర్‌ రెడ్డి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
Samayam Telugu SUNITA


ఘటన అనంతరం తేరుకున్న సునీత మాట్లాడుతూ...తాను క్షేమంగానే ఉన్నానని, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దయతో ప్రమాదం నుంచి బయపడినట్లు ఆమె తెలిపారు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.