యాప్నగరం

US: డల్లాస్‌లో ఆగస్టు 15న ‘ఇండియన్ అమెరికన్ డే’

Indian American Day: భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని టెక్సాస్‌లోని డల్లాస్ అరుదైన గుర్తింపు ఇచ్చింది. ఆగస్ట్ 15వ తేదీని ఇండియన్ అమెరికన్ డేగా ప్రకటించింది. ఆ రోజు ఇండిపెండెన్స్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రవాస భారతీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్‌, ఫోర్ట్ వర్త్ పరిసర ప్రాంతాల్లో సుమారు 2 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారని.. వివిధ రంగాలకు సంబంధించిన అభివృద్దిలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని డల్లాస్ మేయర్ కొనియాడారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 11 Aug 2022, 11:33 pm
మెరికాలోని టెక్సాస్‌లోని డల్లాస్ నగరం (Dallas).. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అరుదైన గుర్తింపునిచ్చింది. ఆగస్ట్ 15వ తేదీని డల్లాస్‌లో ‘ఇండియన్ అమెరికన్ డే’గా (Indian American Day) గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. డల్లాస్ నగర్ మేయర్ ఎరిక్ జాన్సన్.. నగరంలోని సిటీ హాల్‌లో కొంత మంది ప్రవాస భారతీయ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించుకునేందుకు అమెరికాలోని ప్రవాస భారతీయులు సన్నాహకాలు చేస్తున్నారు.
Samayam Telugu Indian American Day in Dallas
డల్లాస్‌లో ఇండియన్ అమెరికన్ డే


డల్లాస్, ఫోర్ట్ వర్త్ నగర పరిసర ప్రాంతాలలో సుమారు 2 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారని.. విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రగతిలో వారి కృషి శ్లాఘనీయమైనదని మేయర్ ఎరిక్ జాన్సన్ పేర్కొన్నారు. ఉత్తర టెక్సాస్‌లో ప్రవాస భారతీయులు వివిధ వ్యాపార రంగాల్లో స్థిరపడి 10 బిలియన్ డాలర్ల పైగా ఆదాయాన్ని సృష్టిస్తూ ఈ ప్రాంత ఆర్ధికాభివృద్ధికి తోడ్పడుతున్నారని కొనియడారు. వారందరికీ హార్దిక కృతజ్ఞతలు తెలిపారు.

ఆగస్టు 15న డల్లాస్‌లో ఇండియన్ అమెరికన్ డే


డల్లాస్ నగర మేయర్ ఆత్మీయ ఆహ్వానం మేరకు ప్రవాస భారతీయ నాయకులు అరుణ్ అగర్వాల్, సల్మాన్ ఫర్ షోరి, రజనీష్ గుప్తా, డాక్టర్ తోటకూర ప్రసాద్ ఈ ప్రత్యేక అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ ఎరిక్ జాన్సన్ ఆగస్ట్ 15వ తేదీని డల్లాస్‌లో ‘ఇండియన్ అమెరికన్ డే’గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన అధికారిక పత్రాన్ని అందజేశారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.