యాప్నగరం

అమెరికాలో తెలుగు వ్యక్తికి మరణ శిక్ష ఖరారు!

అమెరికాలో తొలిసారి ఓ తెలుగు వాడికి మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు.

TNN 1 May 2017, 7:52 am
అమెరికాలో తొలిసారి ఓ తెలుగు వాడికి మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు. అయిదేళ్ల క్రితం డబ్బుల కోసం ఓ చిన్నారిని, ఆమె అమ్మమ్మను చంపినందుకు మరణ శిక్షను ఖరారు చేసింది కోర్టు. త్వరలో ఆ శిక్ష అమలుకానుంది. ఆ హంతకుడి పేరు యండమూరి రఘునందన్. పెన్సిల్వేనియాలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. ఆ పక్క అపార్ట్ మెంట్ లోనే ప్రకాశం జిల్లాకు చెందిన వెన్నా వెంకట్ కుటుంబం నివసిస్తోంది. వెంకట్, అతని భార్య లత ఇద్దరు ఉద్యోగం చేస్తుండడంతో తమకు పుట్టిన పాపను చూసేందుకు తల్లి సత్యవతిని తీసుకొచ్చారు. వీరితో చాలా స్నేహంగా ఉండేవారు రఘునందన్ కుటుంబం. చెడు అలవాట్లకు బానిసైన రఘునందన్... అక్రమ పద్దతిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకు వెంకట్ కుటుంబాన్నే టార్గెట్ చేశారు. వెంటక్ అతని భార్య ఉద్యోగాలకు వెళ్లాక... ఇంట్లో సత్యవతి, తన పదినెలల చిన్నారి శాన్వితో ఒంటరిగా ఉంటుందని అతనికి తెలుసు.
Samayam Telugu death penalty for raghu yandamuri baby saanvis killer
అమెరికాలో తెలుగు వ్యక్తికి మరణ శిక్ష ఖరారు!


2012లో ఇంట్లో ఉన్న డబ్బు ఎత్తుకుపోయేందుకు వెంకట్ ఇంట్లోకి వెళ్లాడు. తెలిసిన వ్యక్తే కావడంతో తలుపుతీసింది సత్యవతి. ఆమెను డబ్బు గురించి అడిగాడు. శాన్విని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని చూశాడు. పాపని ఎత్తుకుపోతుంటే సత్యవతి అడ్డుపడింది. ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. పాపని ఎత్తుకెళ్లి పోయి నోటికి ప్లాస్టర్ వేసి ఓ సూట్ కేసులో పెట్టి అటక మీద పెట్టేశాడు. పాప ఊపిరాడక మరణించింది. పోలీసులు వలపన్ని ఇతడిని అరెస్టు చేశారు. 2014లో కోర్టు మరణశిక్ష విధించింది. విషపు ఇంజెక్షన్ తో అతడిని చంపాలని ఆదేశించింది.


పై కోర్టులో తీర్పును సవాల్ చేశాడు రఘునందన్. ఆ కోర్టులో కూడా చాలా నెలలు విచారణ జరిగింది. చివరికి తాజాగా పై కోర్టు కూడా అతడికి మరణశిక్షే సరైనదని తేల్చింది. అమెరికాలో ఓ తెలుగు వాడికి మరణ శిక్ష పడడం ఇదే తొలిసారి. అతనికి ఎప్పుడు మరణశిక్ష విధిస్తారో ఆ తేదీని ఇంకా ప్రకటించలేదు. మరణశిక్ష అమలయ్యాకే తన కూతురి ఆత్మకు శాంతి కలుగుతుందని వెంకట్ ఆవేదన చెప్పారు. తనచిన్నారిని, తల్లిని కోల్పోయి తానెల బతుకుతున్నానో ఇప్పటికీ అర్థం కావట్లేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.