యాప్నగరం

హరికేన్ హార్వే వరదల్లో మరొక ఇండియన్ స్టూడెంట్ మృతి

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్‌ని వణికించిన హరికేన్ హార్వే వరదల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య..

TNN 4 Sep 2017, 5:21 pm
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్‌ని వణికించిన హరికేన్ హార్వే వరదల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య రెండుకి చేరింది. హూస్టన్‌లోని ఓ చెరువులో ఈతకి వెళ్లిన నిఖిల్ భాటియా, శాలిని సింగ్ అనుకోకుండా ముంచుకొచ్చిన వరదల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. వీరిలో నిఖిల్ భాటియా చికిత్స పొందుతూ ఆగస్టు 31వ తేదీనే తుది శ్వాస విడవగా శాలిని సింగ్ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఐసీయులో వున్న శాలిని సింగ్ కూడా నిన్న రాత్రి తుదిశ్వాస విడిచినట్టు డాక్టర్లు స్పష్టంచేశారు.
Samayam Telugu indian student shalini singh rescued from lake in houston dies
హరికేన్ హార్వే వరదల్లో మరొక ఇండియన్ స్టూడెంట్ మృతి


ఢిల్లీకి చెందిన శాలిని సింగ్ (25) గ్రేటర్ నొయిడాలోని ఐటీఎస్ డెంటల్ కాలేజీలో గ్రాడ్యూయేశన్ పూర్తి చేసి మాస్టర్స్ డిగ్రీ కోసం నెల రోజుల క్రితమే అమెరికా వెళ్లారు. టెక్సాస్‌లోని ఎ అండ్ ఎం యూనివర్శిటీలో పబ్లిక్ హెల్త్ విభాగంలో ఎంఎస్ చేస్తున్న తమ కూతురు నెల రోజుల్లోనే తమకి శాశ్వతంగా దూరమైపోవడం శాలిని కుటుంబాన్ని తీవ్ర మనోవేధనకు గురిచేస్తోంది.

శాలిని ఆస్పత్రిలో మృతి చెందిన సమయంలో ఆమె సోదరుడు, అంకుల్ అక్కడే వున్నారు. ఇండియన్ కాన్సూలేట్ తెలిపిన వివరాల ప్రకారం శాలిని సింగ్ అంత్యక్రియలు అక్కడే నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.