యాప్నగరం

భారీ జీతంతో అమెరికా సైన్యంలో ఉద్యోగం

అమెరికా సైన్యంలో... అది కూడా ఫైటర్ హెలికాఫ్టర్ల తయారీవిభాగంలో ఉద్యోగం పొందాడు ఓ భారత యువకుడు.

TNN 9 May 2017, 11:48 am
అమెరికా సైన్యంలో... అది కూడా ఫైటర్ హెలికాఫ్టర్ల తయారీవిభాగంలో ఉద్యోగం పొందాడు ఓ భారత యువకుడు. ఏడాదికి కోటి ఇరవై లక్షల రూపాయల ప్యాకేజీతో ఆ ఉద్యోగాన్ని పొందాడు. అంటే నెలకి పదిలక్షల రూపాయల జీతమన్న మాట. రాజస్థాన్ లోని జైపూర్‌కు చెందిన మోనార్క్ శర్మ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చదివాడు. సైన్స్ కు సంబంధించిన విషయాలంటే చాలా ఆసక్తి చూపేవాడు. ఇతని తండ్రి జైపూర్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉన్నతాధికారిగా ఉన్నారు. 2011లో నాసా వాళ్లు పెట్టే ఒక పోటీలో పాల్గొని గెలిచాడు. అదే అతని జీవితాన్ని మార్చేసింది. 2013లో నాసా అతనికి మంచి అవకాశాన్ని ఇచ్చింది.
Samayam Telugu jaipur youth joins us army at rs 1 2 crore pay package
భారీ జీతంతో అమెరికా సైన్యంలో ఉద్యోగం


మోనార్క్ ప్రతిభకు మెచ్చి జూనియర్ సైంటిస్టుగా అవకాశం ఇచ్చింది నాసా. తరువాత అమెరికా ఆర్మీ విభాగంలో 2016లో చేరాడు. అక్కడ కొన్ని నెలల్లో తన పనితనాన్ని నిరూపించుకుని రెండు మెడల్స్ కొట్టాడు. దీంతో తాజాగా మోనార్క్‌కు అమెరికా ఆర్మీ ఉపయోగించే ఫైటర్ జెట్ ప్లేన్ విభాగంలో పనిచేసే అవకాశం వచ్చింది. అందుకు ఆయనకు ఏడాది కోటి ఇరవై లక్షల రూపాయల రెమ్యునరేషన్ ను అందించడానికి సిద్ధమైంది అమెరిక ప్రభుత్వం. ఫైటర్ హెలికాఫ్టర్ ల యూనిట్లో వాటి డిజైనింగ్, తయారీ, మెయింటేనన్స్, తనఖీలు చూడడం మోనార్క్ పని. ఒక భారతీయ యువకుడు అమెరికా ఆర్మీలో కీలకమైన పదవిని దక్కించుకోవడం గర్వకారణమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.