యాప్నగరం

హెచ్1బీ వీసా విధానంలో మార్పులేదు: అమెరికా

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న వివాదస్పద నిర్ణయాల్లో హెచ్1 బీ వీసా నిబంధనల్లో మార్పు ఒకటి.

TNN 9 Jan 2018, 3:40 pm
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న వివాదస్పద నిర్ణయాల్లో హెచ్1 బీ వీసా నిబంధనల్లో మార్పు ఒకటి. వీసా నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు ఆయన ప్రకటించడంతో విదేశీ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. హెచ్ 1 బి వీసా నిబంధనలపై అందోళన చెందుతోన్న భారతీయులకు ట్రంప్ సర్కార్ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. హెచ్‌1బి వీసా నిబంధనల్లోని సవరణలపై ఎలాంటి ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోబోమని ట్రంప్ పాలనా యంత్రాంగం సోమవారం ప్రకటించింది. దీంతో అమెరికాలోని విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద వూరట లభించింది. వేలాది మంది హెచ్‌1బీ వీసాదారులను అమెరికా నుంచి వెనక్కి పంపే ప్రతిపాదనలను అమలు చేయబోమని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం వెల్లడించింది.
Samayam Telugu relief for indian techies us says no change in h 1b extension policy
హెచ్1బీ వీసా విధానంలో మార్పులేదు: అమెరికా


ఈ ప్రకటనతో హెచ్ 1బీ వీసాతో అమెరికాలో ప్రవేశించి, గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తోన్న భారతీయ టెక్కీలకు పెద్ద వూరట కలిగింది. వీసా పొడిగింపును నిరాకరించి, వేలాది మంది హెచ్‌1బీ వీసాదారులను బలవంతంగా తమ దేశం నుంచి వెనక్కి పంపిచాలనే నిబంధనలను పరిగణలోకి తీసుకోదని ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ మీడియా రిలేషన్స్‌ అధికారి జొనాథన్‌ వితింగ్టన్‌ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న 21 శతాబ్దపు చట్టం ఏసీ 21 సెక్షన్‌ 104(సీ) ప్రకారం హెచ్‌1బీ వీసాతో అమెరికాలోకి ప్రవేశించి విదేశీయులకు ఆరేళ్లకుపైగా పొడగింపు లభిస్తోంది. అయితే దీనిలో మార్పులు చేసే ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోమని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఒకవేళ ఏదైనా మార్పులు జరిగితే హెచ్‌1బీ వీసా దారులు అమెరికా నుంచి వెళ్లకుండా ఉండేందుకు సెక్షన్‌ 106(ఏ)-(బీ) ద్వారా ఏడాది పొడగింపునకు ఆయా సంస్థలు అభ్యర్థించే అవకాశం ఉందని జొనాథన్‌ తెలిపారు.

హెచ్‌1బీ వీసాలతో అమెరికా వెళ్లిన భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకున్న అమెరికా ఐటీ కంపెనీలు మార్పుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ యంత్రాగంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ వీసా నిబంధనల్లో ప్రతిపాదించిన మార్పులను అమెరికా శాసనకర్తలు, న్యాయవాదులు, నిపుణుల బృందాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిబంధనల వల్ల దాదాపు 5 నుంచి 7.5 లక్షల భారతీయ అమెరికన్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల అమెరికాలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్‌, ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో హెచ్‌1బీ వీసా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని ప్రయత్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.