యాప్నగరం

అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం

అమెరికాలోని సౌత్‌ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భరత్‌రెడ్డి నరహరి దుర్మరణం చెందాడు.

TNN 17 Jan 2018, 10:40 am
మెరికాలోని సౌత్‌ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భరత్‌రెడ్డి నరహరి దుర్మరణం చెందాడు. మృతుడు పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు. ఈ నెల 13న స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తున్న భరత్ రెడ్డి అదుపుతప్పి కింద పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ట్రక్ అతని పైనుంచి వెళ్లింది. భరత్ రెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.
Samayam Telugu telangana techie bharat reddy died in us
అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం


భరత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం ఆలస్యంగా అందింది. అతడి మరణవార్తను చెప్పేందుకు స్నేహితులు చెప్పలేక సతమతమయ్యారు. ఈ సమాచారం తెలియగానే ఆస్ట్రేలియాలో ఉంటున్న భరత్ రెడ్డి సోదరుడు అమెరికా బయల్దేరాడు.

అమెరికాలో ఫిబ్రవరిలో జరగనున్న డాల్ఫీన్స్ క్యాన్సర్ ఛాలెంజ్‌ పోటీల్లో పాల్గొనేందుకు భరత్ రెడ్డి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సౌత్ ఫ్లోరిడాలోని బాపిస్ట్ హెల్త్‌లో ఐటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న భరత్ రెడ్డి మంచి అథ్లెట్ అని తెలిసింది. అమెరికాలోని ట్రియాథ్లాన్ క్లబ్, గో రన్ రన్నింగ్ క్లబ్‌లో అతనికి సభ్యత్వం కూడా ఉంది. భరత్ రెడ్డి మరణానికి బాపిస్ట్ హెల్త్ సంస్థ డైరెక్టర్ సంతాపం ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.