యాప్నగరం

అంధత్వాన్ని నివారించే ఈ ఔషధం ఐదు కోట్లే!

అంధత్వాన్ని నివారించేందుకు అత్యంత ఖరీదైన ఔషధాన్ని అమెరికాకు చెందిన ఓ కంపెనీ అభివృద్ధి చేసింది. కంపెనీ అభివృద్ధి చేసిన దీని ఔషధం ధర 8,50,000 వేల డాలర్లు.

TNN 4 Jan 2018, 3:46 pm
అంధత్వాన్ని నివారించేందుకు అత్యంత ఖరీదైన ఔషధాన్ని అమెరికాకు చెందిన ఓ కంపెనీ అభివృద్ధి చేసింది. కంపెనీ అభివృద్ధి చేసిన దీని ఔషధం ధర 8,50,000 వేల డాలర్లు. లుక్సుటుర్నా పేరుతో ఫిల్‌డెల్ఫియాకు చెందిన స్పార్క్ థెరిప్యుటిక్స్ బయోటెక్నాలజీ సంస్థ రూపొందించిన ఈ ఔషధాన్ని కంటి చికిత్సలో వినియోగిస్తారు. రెటీనాలో కణజాల క్షీణత వల్ల కలిగే రుగ్మతలను ఇది నివారిస్తుంది. ఈ ఔషధం ఒక డోసు తీసుకుంటే వ్యాధి నయమవుతుందని, కంటిచూపు మెరుగుపడుతుందని ఆ సంస్థ వెల్లడించింది. ఒక డోసు ధర 8,50,000 డాలర్లు (రూ.5,39,79,250) గా నిర్ణయించింది. అంతే కాదు ఒకే డోసులో ఉంటుందని తెలిపింది.
Samayam Telugu a us drugmaker offers to cure rare blindness for 850000
అంధత్వాన్ని నివారించే ఈ ఔషధం ఐదు కోట్లే!


ఒక కన్నుకు అయితే 4,25,000 డాలర్లు (రూ. 2,69,89,625). గత డిసెంబరులో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి కోసం ధరఖాస్తు చేసినప్పుడు ఒక్కో కన్నుకు ఔషధ ధర 10 లక్షల డాలర్లుగా పేర్కొంది. అయితే అనుమతి తర్వాత మాత్రం దీని ధరను తగ్గించారు. ఈ ఔషధం ధర చాలా ఎక్కువైనా, అద్భుతంగా పనిచేస్తుందని, అలా కాని పక్షంలో డబ్బు వాపసు ఇస్తామని స్కార్క్ థెరిప్యుటిక్స్ బయోటెక్నాలజీకి చెందిన ఫార్మసీ బెనిఫిట్స్ మేనేజర్ డాక్టర్ స్టీవ్ మిల్లర్ తెలిపారు. ఇది అద్భుతమైన ఆవిష్కరణ అని, గత రెండు దశాబ్దాలుగా కణజాల చికిత్స గురించి తీవ్రమైన చర్చ జరుగుతోందని అన్నారు.

వంశపారపర్యంగా రెటీనా కణజాల క్షీణత వల్ల కంటిచూపు కోల్పోయిన రోగులు అమెరికాలో 1000 నుంచి 2000 వరకు ఉన్నట్లు సమాచారం. ఏటా పది నుంచి ఇరవై కొత్త కేసులు చేరుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్‌ గ్లైబెరా. దీన్ని డచ్‌కు చెందిన యూనీక్యూర్‌ అనే కంపెనీ పది లక్షల డాలర్లకు అమ్ముతోంది. ఇది జన్యుపరమైన సమస్యలను నయం చేసేందుకు ఉపయోగపడుతుంది. లుకేమియా వ్యాధికి నొవార్టీస్ బయోటెక్ ఇటీవల ఓ ఔషధాన్ని కనుగొంది. దీని ధర 4,75,000 డాలర్లుగా నిర్ణయించింది. తమ ఔషధం నెల రోజుల్లోగా ప్రభావం చూపకపోతే ఈ డబ్బు తిరిగి ఇవ్వమని ఆ సంస్థ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.