యాప్నగరం

యుగాంతానికి గ్రహాలే ఢీకొనక్కర్లేదట!!

గ్రహాలు, గ్రహ శకలాలు ఢీకొంటేనే యుగాంతం అవుతుందని భావిస్తే తప్పే. మానవ తప్పిదాల వల్ల కూడా యుగాంతానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

TNN 23 Sep 2017, 8:20 pm
యుగాంతం వస్తుందనే ప్రచారాలను గుడ్డిగా నమ్మేవాళ్లు... చివరి రోజుల్లో అన్నీ అనుభవించి చనిపోదామని ఆలోచిస్తున్నారే గానీ, అది ఏ కారణంతో వస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచించేవాళ్లు చాలా అరుదు. గ్రహాలు, గ్రహ శకలాలు ఢీకొంటేనే యుగాంతం అవుతుందని భావిస్తే తప్పే. మానవ తప్పిదాల వల్ల కూడా యుగాంతానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Samayam Telugu earth is inching closer towards mass extinction its going to be caused by climate change
యుగాంతానికి గ్రహాలే ఢీకొనక్కర్లేదట!!


అంతేగాక, ఇప్పటికే చేసిన భారీ తప్పిదాల ఫలితంగా భూమి ఆరో యుగాంతం దగ్గరపడుతోంది. మితి మీరిన ఇంధన వినియోగం, వాయు కాలుష్యం ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

దాదాపు 540 మిలియన్ ఏళ్ల నుంచి వాతావరణంలోని కార్బన్ ఉద్గారాల సైకిల్స్ (భ్రమణాలు)లో ఏర్పడుతున్న మార్పులను వీరు పరిశీలించారు. దాదాపు 66 మిలియన్ ఏళ్ల కిందట చోటు చేసుకున్న యుగాంతంలో ఈ భూమిపై ఉన్న జీవరాశుల్లో మూడోవంతు భాగం అంతమైపోయాయని వెల్లడించారు.

ఇప్పుడున్న కార్బన్ స్థాయిలను క్రమేనా పెంచుకుంటూ పోతే.. 2100 నాటికి దాదాపు 310 గిగా టన్నులకు చేరుతుందని అంచనా వేశారు. ఈ మేరకు 2100 నుంచి భూమి ఆరవ యుగాంతంలోకి ప్రవేశించడం మొదలవుతుందని వెల్లడించారు.

అయితే.. యుగాంతం వెంటనే వచ్చేస్తుందనే విషయం తాము చెప్పడం లేదని, భూమిని కాపాడుకునేందుకు ఇప్పటికీ మనకు అవకాశాలున్నాయని తెలిపారు. మనం కార్బన్ ఉద్గారాల వినియోగం ఎంత తగ్గిస్తే అంత మంచిదని ఎంఐటీ జీయోపిజిక్స్ ప్రొఫెసర్ డానియల్ రోత్మాన్ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.