యాప్నగరం

గూగుల్ మ్యాప్స్: ఇక గ్రహాలనూ చూసేయొచ్చు!

ఔను, నిజం! గూగుల్ మ్యాప్‌లో కేవలం భూమి, చంద్రుడిని మాత్రమే కాదు. ఇతర గ్రహాలను సైతం చూసేయోచ్చు.

Samayam Telugu 17 Oct 2017, 12:57 pm
ను, నిజం! గూగుల్ మ్యాప్‌లో కేవలం భూమిని మాత్రమే కాదు. ఇతర గ్రహాలను సైతం చూసేయోచ్చు. ఈ సరికొత్త ఆప్షన్‌ను ఇటీవలే గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. భూమితోపాటు సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలన్నింటినీ చూసేందుకు వీలుగా గూగుల్ మ్యాప్స్ మార్పులు చేసింది. గూగుల్ మ్యాప్ ఇదివరకే చంద్రుడు, అంగారక గ్రహాల మ్యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అవి కాకుండా మరో 12 వరకు గ్రహాలను, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ISS)ను సైతం మ్యాప్స్‌లో ఏర్పాటు చేసింది.
Samayam Telugu google maps out moons and planets across the solar system
గూగుల్ మ్యాప్స్: ఇక గ్రహాలనూ చూసేయొచ్చు!


NASA, ESA తదితర ఏజెన్సీల ద్వారా సేకరించిన ఫొటోల ఆధారంగా ఈ మ్యాప్‌లను రూపొందించారు. వీటిలో కొన్నింటిని జూమ్ చేసి చూసేందుకు కూడా వీలుంది. గూగుల్ మ్యాప్స్‌లో ఆ సరికొత్త ప్రపంచాన్ని మీరు కూడా వీక్షించండి.
Source: Google Maps

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.