యాప్నగరం

చైనా వణకాల్సిందే.. మరోసారి అగ్ని-5 పరీక్ష విజయవంతం

భారత్ మరోసారి అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఈ ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ను ఆదివారం ఉదయం 9.50 గంటలకు పరీక్షించారు.

Samayam Telugu 3 Jun 2018, 11:25 am
భారత్ మరోసారి అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఈ ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ను ఆదివారం ఉదయం 9.50 గంటలకు పరీక్షించారు. 5 వేల కి.మీ. దూరంలోని లక్ష్యాలను తేలిగ్గా తాక గలిగే ఈ క్షిపణిని ఒడిశాలోని కలాం ఐలాండ్‌లో పరీక్షించారు. అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ఇదో ఆరోసారి కావడం విశేషం. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 18న ఈ క్షిపణిని పరీక్షించారు.
Samayam Telugu agni5


ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే వీలున్న అగ్ని-5 క్షిపణి చైనాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగలదు. 17 మీటర్ల ఎత్తు ఉండే ఈ క్షిపణి.. 1360 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. అగ్ని సిరీస్‌లో ఇది ఐదోది కాగా.. దాదాపు సగం ప్రపంచం దీని గుప్పిట్లోకి వస్తుంది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనాల దగ్గర మాత్రమే ఇలాంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి.

ఇప్పటి వరకు అగ్ని క్షిపణుల్లో అగ్ని-1 పరిధి 700 కి.మీ.లు, అగ్ని-2 పరిధి2000 కి.మీ.లు కాగా.. అగ్ని-3 పరిధి 2500 కి.మీ. అగ్ని-4 పరిధి 3500 కి.మీ. అగ్ని-5 క్షిపణిని తొలిసారిగా 2012, ఏప్రిల్ 19న ప్రయోగించారు. మరికొన్ని ప్రయోగాల తర్వాత దీన్ని భారత సైన్యానికి అందజేస్తారు. అగ్ని-5లో రింగ్ లేజర్ గైరో బేస్డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (RINS), మైక్రో నావిగేషన్ సిస్టమ్ (MINS)లను ఉపయోగించడం వల్ల లక్ష్యాల్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. నావిక్ ఆధారంగానూ అగ్ని-5 పనిచేస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.