యాప్నగరం

రష్యా శాటిలైట్‌కు 200 మీటర్ల సమీపానికి ఇస్రో కార్టోశాట్.. ఆందోళనలో శాస్త్రవేత్తలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2018 జనవరిలో ప్రయోగించి భూ పరిశీలన ఉపగ్రహాం కార్టోశాట్-2ఎఫ్ అత్యంత ప్రమాదకరంగా రష్యా శాటిలైట్‌కు చేరువగా వచ్చింది.

Samayam Telugu 28 Nov 2020, 12:39 pm
భారతకు చెందిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం కార్టోశాట్-2ఎఫ్.. సమీప భూకక్ష్యలో ఉన్న రష్యా భూపరిశీలన ఉపగ్రహానికి (కానోపస్-వీ)కి ప్రమాదకరరీతిలో అత్యంత చేరువుగా వచ్చింది... ఈ పరిణామాలను రెండు దేశాల అంతరిక్ష సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. భూకక్ష్యకు సమీపంలో భారత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం కార్టోశాట్-2ఎఫ్, రష్యాకు చెందిన భూ పరిశీలక ఉపగ్రహం (కనోపుస్-వీ) అంత్యంత సమీపంగా వచ్చినట్టు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ శుక్రవారం వెల్లడించింది.
Samayam Telugu కార్టోశాట్-2ఎఫ్


‘భూకక్ష్యకు సమీపంలో ఉన్న ప్రదేశం (రోస్కోస్మోస్‌లో భాగం) ఆటోమేటెడ్ సిస్టమ్ తియాన్‌మాస్ ప్రధాన సమాచార విశ్లేషణాత్మక కేంద్రం ప్రకారం.. 700 కిలోల బరువున్న కార్టోశాట్-2ఎఫ్ ఉపగ్రహం నవంబరు 27 అర్ధరాత్రి 1.49 గంటల సమయంలో ప్రమాదకరంగా రష్యన్ అంతరిక్ష నౌక కానోపస్‌ను సమీపించింది’ అని తెలిపింది.

తియాన్‌మాస్ అంచనా ప్రకారం.. ఈ రెండు ఉపగ్రహాల మధ్య దూరం కేవలం 224 మీటర్లు మాత్రమే.. రెండు ఉపగ్రహాలను భూ పరిశీలన కోసమే తయారుచేశారు’ అని రాస్కోస్మాస్ పేర్కొంది. అయితే, దీనిపై ఆందోళన అవసరం లేదని ఇస్రో ఛైర్మన్ శివన్ అన్నారు. ‘మేము నాలుగు రోజులుగా ఉపగ్రహాన్ని ట్రాక్ చేస్తున్నాం.. ఇది రష్యన్ ఉపగ్రహం నుంచి 420 మీటర్ల దూరంలో ఉంది.. ఇరు ఉపగ్రహాల మధ్య 150 మీటర్ల దూరం ఉన్నప్పుడు మాత్రమే చర్య జరుగుతుంది’చెప్పారు.

తక్కువ ఎత్తులోని భూకక్ష్యల్లో ఉపగ్రహాలు ఉన్నప్పుడు ఇది సర్వసాధారణమేనని శివన్ తెలిపారు. ఈ సమస్యపై రెండు ఏజెన్సీలు చర్చించి ఒక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించుకుంటాయని అన్నారు. ఇటీవల స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహంతో ఇటువంటి ఇబ్బందు ఎదురైతే పరిష్కరించామని, ఈ విషయాలను సాధారణంగా బహిర్గతం చేయమని శివన్ వ్యాఖ్యానించారు.

రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం కార్టోశాట్-2ఎఫ్ శ్రీహరికోటలోని మొదటి ల్యాంచింగ్ కేంద్రం నుంచి 2018 జనవరి 12న ప్రయోగించారు. ఇది ఇస్రో రూపొందించిన వందో స్వదేశీ ఉపగ్రహం కావడం విశేషం. ఈ సమయంలో స్వదేశీ ఉపగ్రహంతో పాటు మరో 28 విదేశీ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.