యాప్నగరం

అజిత్ మల్టీ టాలెంట్.. దక్ష టీమ్ 'డ్రోన్ టాక్సీ' టెస్ట్ సక్సెస్

మల్టీ టాలెంట్‌తో అదరగొడుతున్న తమిళ స్టార్ హీరో అజిత్.. మిట్ (మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) విద్యార్థులతో కలిసి డ్రోన్ టాక్సీ రూపొందించిన అజిత్.. ప్రయోగం విజయవంతం.

Samayam Telugu 13 Nov 2018, 1:34 pm

అజిత్ కుమార్.. తమిళ స్టార్ హీరోగానే అందరికి పరిచయం. కాని ఆయన దగ్గరున్న మల్టీ టాలెంట్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అజిత్ బైక్ రేసింగ్.. కార్ రేసింగ్ లో ప్రొఫెషనల్.. అలాగే పైలట్ కూడా.. ఫైటర్ జెట్ నడపగలరు. ఈ టాలెంట్ చూసే.. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ‘దక్ష’ టీంకు 'హెలికాప్టర్ టెస్ట్ పైలట్'గా అజిత్‌ను నియమించారు.
Samayam Telugu ajith


ఎంఐటీ విద్యార్థులతో కలిసి ఒక అడ్వాన్స్డ్ డ్రోన్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న స్టార్ హీరో.. అనుకున్నది సాధించారు. 'దక్ష' టీంతో కలిసి దేశంలోనే తొలిసారిగా డ్రోన్ టాక్సీని రూపొందించారు. ఒక మనిషిని క్యారీ చేయగల ఈ డ్రోన్‌ను విజయవంతంగా ప్రయోగించగా.. అజిత్ స్వయంగా ఆపరేట్ చేశారు. దేశంలోనే ఇది ఓ రికార్డుగా నిలవగా.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మిట్ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు.
అజిత్ పైలట్ పాఠాలు.. ఎంఐటీ విద్యార్థులకు సాయం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.