యాప్నగరం

ఈ బస్సు నుంచి పొగరాదు, నీరే వస్తుంది!

దేశంలోనే తొలి ‘హైడ్రోజన్’ బస్సు ఇది. పెట్రోల్, డీజిల్ బస్సుల తరహాలో ఇది కాలుష్యం వదలదు. కేవలం నీటిని మాత్రమే వదులుతుంది.

Samayam Telugu 14 Mar 2018, 4:32 pm
ర్యావరణానికి సవాలు విసురుతున్న కాలుష్యాన్ని తరిమి కొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. సత్ఫలితాలు రావడం లేదు. డీజిల్, పెట్రోల్ వాహనాల సంఖ్య క్రమేనా పెరగడమే ఇందుకు కారణం. వీటికి ప్రత్యామ్నంగా బ్యాటరీతో నడిచే వాహనాలు అందుబాటులోకి వచ్చినా.. ప్రజలు వాటిపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ‘హైడ్రోజన్’ ఇంధనం తెరపైకి వచ్చింది. అయితే, ఇది పెట్రోల్, డీజిల్ తరహాలో కాలుష్యం వెదజల్లదు. కేవలం నీటిని మాత్రమే వదులుతుంది. పైగా, ఈ ఇంధనం చౌక ధరల్లోనే లభిస్తుంది.
Samayam Telugu indias first hydrogen fuel cell bus is here emits water not pollutants
ఈ బస్సు నుంచి పొగరాదు, నీరే వస్తుంది!


ఈ నేపథ్యంలో టాటా మోటార్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లు సంయుక్తంగా హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్‌తో నడిచే తొలి బస్సును అందుబాటులోకి తెచ్చాయి. ప్రస్తుతం ట్రైల్ రన్‌లో ఉన్న ఈ బస్సు విజయవంతంగా పరుగులు తీస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దేశంలో త్వరలోనే ఇలాంటి బస్సులు ప్రయాణికులకు సేవలు అందించే అవకాశాలున్నాయి.

ప్రపంచంలో చాలా దేశాల్లో ఇప్పటికే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా లండన్‌లో పర్యవరణ పరిరక్షణ కోసం ఈ బస్సులు నడుపుతున్నారు. హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్ బ్యాటరీ తరహాలోనే పనిచేస్తాయి. వీటికి ఛార్జింగ్ తప్పనిసరి. ఇది కాలుష్యానికి బదులు నీరు, వేడిని మాత్రమే బయటకు వదులుతుంది. పెట్రోల్, డీజిల్ వాహనాల సామర్థ్యంతో సమానంగానే ఈ బస్సు కూడా పరుగులు తీస్తుంది. వీలైనంత త్వరలో ఈ బస్సులు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావాలని కోరుకుందాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.