యాప్నగరం

ISRO EOS-06 అద్భుతమైన ఫోటోలు పంపిన ఈవో శాట్-6.. షేర్ చేసిన ఇస్రో

ISRO EOS-06 నవంబరు 26 ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ 54 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్‌ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఈవోఎస్‌ శాట్‌-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా మోసుకెళ్లింది. ఇది ఇస్రో పీఎస్ఎల్వీలో 24 వ ప్రయోగం కావడం చెప్పుకోదగ్గ విశేషం.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 30 Nov 2022, 4:06 pm

ప్రధానాంశాలు:

  • గుజరాత్ తీరంలో ఫోటోలు పంపిన శాటిలైట్
  • వర్చువల్‌గా విడుదల చేసిన ఇస్రో ఛైర్మన్
  • భూ పరిశీలనకు దోహదం చేసే ఈవోఎస్-6
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ISRO
ISRO EOS-06 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నవంబరు 26న ఓషన్‌‌శాట్‌, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్‌ శాట్‌)-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 ద్వారా నింగిలోకి పంపిన విషయం తెలిసిందే. ఇందులో ఈవోఎస్‌ శాట్‌-6 పనిచేయడం ప్రారంభించినట్టు ఇస్రో బుధవారం వెల్లడించింది. ఈ ఉపగ్రహం మొదటి రోజు తీసిన ఫోటోలను ట్విట్టర్‌లో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం షేర్ చేసింది. హైదరాబాద్‌ సమీపంలోని షాద్‌నగర్‌లో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు శాటిలైట్ తీసిన ఫోటోలు చేరాయి. ఆరేబియా సముద్రం, గుజరాత్‌లోకి కచ్ సహా హిమాలయ ప్రాంతాన్ని ఈవోఎస్ శాట్ ఫోటోలు తీసింది.
ఈవోఎస్ శాట్-6 ‘ఓషన్ కలర్ మానిటర్ (OCM) సీ సర్ఫేస్ టెంపరేచర్ మానిటర్ (SSTM) సెన్సార్‌ల ద్వారా ఫోటోలు సంగ్రహించింది’ అని ఇస్రో పేర్కొంది. ఉపగ్రహం పంపిన ఫోటోలను ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వర్చువల్‌గా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ ఎం శంకరన్, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాశ్ చౌహన్‌లు పాల్గొన్నారు.


ఓషన్‌‌శాట్‌ ఉపగ్రహాల ద్వారా భూవాతావరణాన్ని పరిశీలించడం, తుఫానులను పసిగట్టడం, వాతావరణంలో తేమను అంచనా వేయడం, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేస్తారు. హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం.. మీథేన్‌ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు దోహదపడుతుంది.

కాగా, నవంబరు నెలలో దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ప్రైవేట్ సంస్థ అభివృద్ది చేసిన రాకెట్ విక్రమ్ - Sను.. విజయవంతంగా నింగిలోకి పంపింది. అలాగే, గగన్‌యాన్ ప్రయోగం కోసం కూడా వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చే మాడ్యూల్‌ను కూడా నిర్వహించి విజయం సాధించింది.

Read Latest Science and Technology News And Telugu New
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.