యాప్నగరం

పీఎస్ఎల్వీ-సీ37 తీసిన సెల్ఫీ వీడియో!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిన్న ఉద‌యం ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ప్రయోగించి మ‌న దేశ ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన సంగతి తెలిసిందే.

TNN 16 Feb 2017, 4:31 pm
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిన్న ఉద‌యం ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ప్రయోగించి మ‌న దేశ ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన సంగతి తెలిసిందే. ఈ ప్ర‌త్యేక ఘ‌ట్టాన్ని మ‌రింత మ‌ధురం చేయ‌డానికి ఇస్రో ముందుగానే ఒక ఏర్పాటు చేసింది. ఉపగ్రహాలను మోసుకుపోయిన పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహక నౌకకు హై రిజల్యూషన్‌ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా నుంచి సెల్ఫీ వీడియో అందేలా శాస్త్రవేత్తలు ప్ర‌త్యేక‌ ఏర్పాటు చేశారు. ఈ వీడియోను ఇస్రో ఇవాళ విడుద‌ల చేసింది.
Samayam Telugu isro releases pslv c37 lift off and onboard camera video
పీఎస్ఎల్వీ-సీ37 తీసిన సెల్ఫీ వీడియో!


రాకెట్‌ లాంచ్‌ ప్రారంభం నుంచే కెమెరా త‌న ప‌ని ఆరంభించింది. అది అద్భుతమైన సెల్ఫీ వీడియోను చిత్రీకరించి, మ‌న‌కు అందించింది. లాంచ్‌ ప్రారంభమైన 18 నిమిషాల్లోనే మ‌న దేశానికి చెందిన మూడు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. ఆ తర్వాత వ‌ర‌స‌గా మిగతా 101 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయిన దృశ్యాలు వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. వీటితో పాటు నీలం, తెలుపు రంగుల్లో భూమి కూడా కనిపిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.