ఎన్నో వింతలు, విశేషాలకు నిలయమైన నింగిలో సోమవారం రాత్రి అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. సౌర కుటుంబంలో అతిపెద్దదైన గురు గ్రహం భూమికి అత్యంత సమీపానికి రానుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) పేర్కొంది. శని, బృహస్పతి (గురువు), భూమి మూడు ఒకే సరళ రేఖలో కనిపించనున్నాయని తెలిపింది. 59 ఏళ్ల తర్వాత భూమికి అత్యంత చేరువగా గురు గ్రహం రావడం ఇదే మొదటిసారి. చివరిగా 1963లో ఇది సాధ్యమైంది. మళ్లీ ఈ దృశ్యాన్ని చూడాలంటే శతాబ్దానికిపైగా వేచి చూడాల్సిందే. 107 ఏళ్ల తర్వాత అంటే 2129లో మళ్లీ బృహస్పతి భూమికి చేరువగా వస్తారు. అంటే ప్రస్తుతం భూమిపై ఉన్న ఏ ఒక్కరికీ మళ్లీ ఇలాంటి దృశ్యాన్ని చూసే అవకాశం ఉండదు. భూమికి సమీపానికి వచ్చినప్పుడు.. భూమి, గురు గ్రహం మధ్య దూరం 59,06,29,248 (59.06 కోట్లు) కిలోమీటర్లు ఉంటుంది. భూమి నుంచి దూరంగా వెళ్లినప్పుడు ఇది 96,56,06,400 (96.56కోట్లు) కిలోమీటర్లు. సౌర కుటుంబంలో అతిపెద్దదైన గురు గ్రహం భూమికి సమీపంగా వచ్చినప్పుడు.. చాలా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనుంది. ప్రతి 399 రోజులకు ఒకసారి (13 నెలల నాలుగు రోజులు) భూమికి వ్యతిరేక దిశలోకి బృహస్పతి వస్తుంది. అప్పుడు ఆకాశంలో గురుగ్రహం ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంటుంది. ఇది మంగళవారం ఆవిష్కృతం కానుంది.
సోమవారం సాయంత్రం మాత్రం భూమికి సమీపానికి రానుంది. దాదారు ఆరు దశాబ్దాల తర్వాత బృహస్పతి భూమికి దగ్గరగా ఎందుకు వస్తోంది అంటే రెండు గ్రహాలు సూర్యుని చుట్టూ ఖచ్చితమైన వృత్తాకార కక్ష్యలో లేవు. అంటే ఒక ఏడాదిలో గ్రహాలు ఒకదానికొకటి వేర్వేరు కోణాలు, దూరాలలో ప్రయాణిస్తాయి. ఇది భూమికి బృహస్పతి అత్యంత సమీపం సంఘటనగా చేస్తుంది.
అద్బుతాన్ని ఎలా చూడొచ్చు?
అలబామాలోని హంట్స్‌విల్లేలోని నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రిసెర్చ్ ఆస్ట్రోఫిజియిస్ట్ ఆడమ్ కోబెల్స్కీ ప్రకారం.. ఒక పెద్ద టెలిస్కోప్ని ఉపయోగించి బృహస్పతి గ్రేట్ రెడ్ స్పాట్, చుట్టూ ఉన్న వలయాలను వీక్షించవచ్చు. 4-అంగుళాల లేదా పెద్ద టెలిస్కోప్ ఆకుపచ్చ నుంచి నీలం స్పెక్ట్రమ్‌లోని కొన్ని ఫిల్టర్లు గ్రహ వీక్షణాన్ని మెరుగుపరుస్తాయని సూచించారు.