యాప్నగరం

ఆకాశంలో మరో అద్భుతం.. నేడు భూమికి దగ్గరగా అంగారకుడు!

ఈ రోజు (జులై 31) ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. చంద్రుడికి ఆవల ఉన్న అంగారక గ్రహం మంగళవారం భూమికి దగ్గరగా రానుంది.

Samayam Telugu 31 Jul 2018, 7:03 pm
రోజు (జులై 31) ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. చంద్రుడికి ఆవల ఉన్న అంగారక గ్రహం మంగళవారం భూమికి దగ్గరగా రానుంది. సాధారణంగా ఈ గ్రహం మనకు సుదూరంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ రోజు ఇది మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. అయితే, టెలిస్కోప్ ద్వారా దీన్ని వీక్షించవచ్చు.
Samayam Telugu Untitled


అంగారక గ్రహం మంగళవారం భూమికి 57.6 మిలియన్ కిలోమీటర్ల దూరానికి రానుంది. ప్రస్తుతం అంగారకుడిపై దూళి తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టెలిస్కోప్‌లో అంత స్పష్టంగా కనిపించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూమికి దగ్గరగా ఉన్న శుక్రుడు అంత ప్రకాశవంతంగా అంగారకుడు ఉండకపోవచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు. అంగారక గ్రహం ఎర్ర రంగులో ఉంటుందని, ఈ నేపథ్యం కాషాయ రంగులో ప్రకాశించే అవకాశం ఉందన్నారు.

2003లో దాదాపు 60 వేల సంవత్సరాల కిందట భూమి, అంగారకుడు అత్యంత సమీపంలోకి వచ్చారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అప్పట్లో వీటి మధ్య దూరం దాదాపు 55.7 మిలియన్ కిలోమీటర్లని తెలిపారు. మళ్లీ 2287లో మాత్రమే అంత దగ్గరగా వస్తుందని నాసా పేర్కొంది. అయితే, మళ్లీ 2020వ సంవత్సరంలో 62 మిలియన్ కిలోమీటర్ల దగ్గరకి అంగారకుడు వస్తాడని తెలిపింది. ఈ రోజు అంగారకుడిని చూడటం మిస్సయినా ఫర్వాలేదు. ఆగస్టు నెల మొదటి వారమంతా కనిపిస్తుంది. అయితే, రోజులు పెరిగే కొద్ది క్రమేనా వెనక్కి వెళ్లిపోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.