యాప్నగరం

వింత జీవి అస్థికలు, అది గ్రహాంతరవాసా?

పెరులో మూడు వేళ్లున్న మమ్మీ అస్థికలు లభించాయి. ఇంతకీ అది గ్రహాంతరవాసా? మనిషిని పోలిన మరో జీవా?

Samayam Telugu 13 Mar 2018, 9:30 pm
పెరులో జరిగిన తవ్వకాల్లో మూడు వేళ్లున్న ఓ వింత జీవి అస్థికలు దొరికాయి. ఈజిప్టు మమ్మీ తరహాలో ఉన్న దీని రూపాన్ని ఎక్స్‌రేల్లో పరిశీలిస్తే గ్రహాంతరవాసిలా అనిపిస్తోంది. అయితే, ఇది వేరే గ్రహం నుంచి వచ్చిందా లేదా, భూమిపై అంతరించిన జీవుల్లో ఇదీ ఒకటా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీని అస్థికలు బయటపడి దాదాపు ఏడాది కావస్తున్నా, ఈ జీవి ఏమిటనే విషయంపై పరిశోధకుల మధ్య ఇంకా చర్చ సాగుతూనే ఉంది. తాజాగా రష్యాకు చెందిన ఓ శాస్త్రవేత్త.. ఇది మనిషి కాదని, తప్పకుండా గ్రహాంతరవాసేనని స్పష్టం చేశారు. ఈ విషయం నిరూపించేందుకు డీఎన్ఏ పరీక్షలు కూడా చేసినట్లు తెలిపారు.
Samayam Telugu three fingered mummified creatures found with elongated skulls in peru
వింత జీవి అస్థికలు, అది గ్రహాంతరవాసా?


సెయింట్ పీటర్స్‌బర్గ్ ఫెడరల్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్, బయోపిజిక్స్ విభాగానికి చెందిన ఆ ప్రోఫెసర్ డాక్టర్ కాన్‌స్టాంటిన్ కొరాట్‌కోవ్ ఈ వాదన చేస్తున్నారు. ఈజిప్టులో ఉన్నవి అసలు మమ్మీలే కావని, గ్రహాంతరవాసులని అంటున్నారు. చారిత్రాత్మక నగరమైన ‘పెరు’లో గ్రహాంతరవాసులు ఉన్నాయనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కొందరు పరానార్మల్ రీసెర్చర్లు కూడా తెలుపుతున్నారు.

‘మారియా’ అనే ఈ మమ్మీపై ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. అయితే, ఇది గ్రహాంతరవాసి కానట్లయితే.. భూమిపై మూడు వేళ్లు ఉన్నటివంటి మనిషిలాంటి జీవులు ఉన్నాయా అనే విషయంపై కూడా పరిశోధన చేస్తున్నారు. దీనిపై ఆసక్తికరమైన డాక్యుమెంటరీ కూడా విడుదలైంది. ఆ వీడియోను ఇక్కడ చూడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.