యాప్నగరం

కూలుతున్న స్పేస్ ల్యాబ్: ఇండియా సేఫా.. కాదా?

చైనాకు చెందిన స్పేస్ ల్యాబ్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 8 టన్నుల బరువైన ఈ శకలాలు ఎక్కడ కూలతాయో అనే ఆందోళన నెలకొంది.

Samayam Telugu 21 Mar 2018, 11:32 pm
అంతరిక్షంలో నియంత్రణ కోల్పోయిన చైనా స్పేస్ ల్యాబ్ (‘టియాంగోన్గ్-1) క్రమేనా భూమికి దగ్గరవుతోంది. దాదాపు 8.5 టన్నుల బరువుండే ఈ స్పేస్ ల్యాబ్ శకలాలు.. జనావాసాలపై కూలితే ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉంటుందని భావిస్తున్నారు. 2011లో ప్రారంభించిన ఈ స్పేస్ స్టేషన్ ఎన్నాళ్లో అంతరిక్షంలో నిలవలేదు. 2016లో నియంత్రణ కోల్పోయిన ఈ స్పేస్‌ ల్యాబ్ ఇప్పుడు గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది.
Samayam Telugu wwwsd


దీని కదలికలను ‘శాట్‌వ్యూ అనే శాటిలైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ద్వారా గమనిస్తున్నారు. అయితే, ఇది ఇటలీ మీదుగా ప్రయాణిస్తూ అమెరికాలోని మిచిగన్‌పై కూలే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ దాదాపు 10 మిలియన్ పైగా జనాభా నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
Read Also: స్పేస్ ల్యాబ్ కూలితే ఏలాంటి నష్టం వాటిల్లుతుంది? గతంలో ఏం జరిగింది?
ఇండియాపై కూలుతుందా?
స్పేస్ ల్యాబ్ ప్రస్తుత గమనం బట్టి.. అది ఇండియాపై పడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఇంకా భూ వాతావరణంలోకి ప్రవేశించని నేపథ్యంలో అది భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. దాని గమనం ఆధారంగా ఉత్తర చైనా, ఇటలీ, ఉత్తర స్పెయిన్, మిడిల్ ఈస్ట్, న్యూజిలాండ్, తస్మానియా, దక్షిణ, ఉత్తర అమెరికా, దక్షిణ ఆఫ్రీకా ప్రాంతాల్లో శకలాలు పడే అవకాశాలూ లేకపోలేదని తెలుస్తోంది. ఇది ఏప్రిల్ 1 ముందుగానీ, తర్వాత గానీ కూలే అవకాశాలున్నాయని అంచనా. స్పేస్ ల్యాబ్ గమనాన్ని లైవ్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.